iPhone 14 : ఐఫోన్ 13 కన్నా ఐఫోన్ 14 చాలా ఛీప్.. ధరెంతో తెలుసా?
iPhone 14 : గత సంవత్సరం సెప్టెంబర్ లో ఐఫోన్ 13ను యాపిల్ సంస్థ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా సంవత్సరం తర్వాత ఐఫోన్ 14ను యాపిల్ సంస్థ విడుదల చేయబోతోంది. నిజానికి.. ఐఫోన్ 13 విడుదలైన కొన్ని నెలల తర్వాత నుంచే ఐఫోన్ 14 గురించి యాపిల్ కొన్ని విషయాలు తెలియజేస్తూ వచ్చింది. ఐఫోన్ 13 లో లేని పలు ఫీచర్లను ఐఫోన్ 14లో తీసుకొస్తున్నట్టు యాపిల్ ప్రకటించింది. అయితే.. ఐఫోన్ 14 బేసిక్ మోడల్ ను ఐఫోన్ 13 కంటే ఛీప్ గా అందించేందుకు యాపిల్ సమాయత్తం అయినట్టు తెలుస్తోంది. ఐఫోన్ 14 ప్రారంభ ధర కేవలం 799 డాలర్స్ గానే ఉండనుంది. అంటే.. మన కరెన్సీలో కేవలం రూ.64,000 గా ఉండనుంది. ప్రో మోడల్స్ ధర మరో 100 డాలర్లు ఎక్కువగా ఉండనుంది. ప్రస్తుతం ఉన్న విదేశీ మారకపు రేటుతో పాటు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుంటే యాపిల్ సంస్థ ఐఫోన్ 14ను కేవలం 749 డాలర్లకే అంటే రూ.60,000 కే అందిస్తుందని ఓ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ వెల్లడించింది.
మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ట్రెండ్ ఫోర్స్ ప్రకారం.. ఐఫోన్ 14 ధరలపై యాపిల్ పునరాలోచించి ఐఫోన్ 13 మోడల్స్ కంటే కూడా తక్కువ ధరకే అందించనుందని తెలిపింది. ఐఫోన్ 14 బేసిక్ మోడల్ 749 డాలర్లు(రూ.60,000), ఐఫోన్ 14 మ్యాక్స్ మోడల్ ధర 849 డాలర్లు(రూ.68,000), ఐఫోన్ 14 ప్రో మోడల్ ధర 1,049 డాలర్లు(రూ.83,000), ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్ ధర 1,149 డాలర్లు(రూ.91,000) గా ఉండనుంది.
iPhone 14 : ఐఫోన్ 14 ఫీచర్లు ఇవే
ఐఫోన్ 13 కంటే ఐఫోన్ 14లో అత్యాధునికమైన ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్ 14 ప్రో మోడల్స్ సరికొత్త యాపిల్ ఏ16 బయోనిక్ చిప్ ఉండనుంది. అలాగే.. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లు 48 ఎంపీల వైడ్ యాంగిల్ సెన్సార్ తో రానున్నాయి. ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లలో 12 ఎంపీల సెన్సార్స్ మాత్రమే ఉండేవి. కానీ.. ఐఫోన్ 14 ప్రో సిరీస్ లో ఏకంగా 48 ఎంపీల సెన్సార్ ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే.. ఐఫోన్ 14 సిరీస్ మొత్తం ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీలతో రానున్నాయి. సెప్టెంబర్ 7న యాపిల్ స్పెషల్ లాంచ్ ఈవెంట్ లో ఐఫోన్ 14 సిరీస్ ను యాపిల్ సంస్థ లాంచ్ చేయనుంది.