Jio 5G : అన్ని 5జీ ఫోన్లకు జియో 5జీ పని చేస్తుందా? ఏ మొబైల్స్ కు పని చేస్తుంది? ఏ మొబైల్స్ కు పని చేయదు?
Jio 5G : ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో వినిపిస్తున్న ఒకే ఒక పేరు 5జీ. అవును.. మనం ఇంకా 4జీలోనే ఉన్నాం కానీ.. డెవలప్ అయిన చాలా దేశాల్లో ఇప్పటికే 5జీ చలామణిలో ఉంది. 5జీ నెట్ వర్క్ ను వాళ్లు ఉపయోగిస్తున్నారు. కానీ.. మన దేశంలో మాత్రం 5జీ సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. కానీ.. ఈ దీపావళి నుంచి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయని జియో ప్రకటించింది. అయితే.. జియో 5జీ నెట్ వర్క్ అసలు ఏ మొబైల్స్ లో వస్తుంది. ఏ మొబైల్స్ లో రాదు. అన్ని 5జీ మొబైల్స్ లో వస్తుందా? అనే డౌట్స్ చాలామందికి వస్తుంది. అలాగే.. స్టాండ్ అలోన్ (ఎస్ఏ) సేవలు అందిస్తామని కూడా జియో చెబుతోంది. అసలు ఈ 5జీ గోల ఏంటో ఒకసారి తెలుసుకుందాం రండి.
రిలయెన్స్ జియో ఏం చెబుతోందంటే.. ఎస్ఏ అంటే స్టాండ్ అలోన్ సేవలు అందిస్తామని చెబుతోంది. ఇక.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్ 12 సిరీస్ నుంచి 5జీ పని చేస్తుంది. ఐఫోన్ 12 సిరీస్ మోడల్స్ అన్నింటిలో జియో 5జీ పని చేస్తుంది. అంటే 12 సిరీస్ కంటే ముందు వచ్చిన ఐఫోన్ సిరీస్ లలో మాత్రం జియో 5జీ పనిచేయదు. యాపిల్ 13, త్వరలో రాబోయే 14 సిరీస్ లోనూ జియో 5జీ పని చేస్తుంది. డైరెక్ట్ గా 5జీ కాకుండా.. ఎస్ఏ 5జీని జియో అందిస్తోందని తెలుసు కదా.
Jio 5G : ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్స్ లోనూ జియో 5జీ.. ఏ మోడల్స్ లో అంటే ?
సామ్ సంగ్ మొబైల్స్ లో కూడా ఎస్ఏ 5జీ ని వాడుకోవచ్చు. 5జీ సపోర్ట్ చేసే అన్ని సామ్ సంగ్ మొబైల్స్ లో జియో 5జీ వస్తుంది. కాకపోతే.. 5జీ కోసం అప్ డేట్ ఏదైనా వస్తుందేమో వేచి చూడాలి. ఇటీవల కొత్తగా వచ్చిన నథింగ్ మొబైల్స్, వన్ ప్లస్ నుంచి వచ్చిన నార్డ్, నార్డ్ సీఈలోనూ జియో 5జీని వాడుకోవచ్చు. ఒప్పో మొబైల్స్ లో లేటెస్ట్ సిరీస్ లు అన్నింటిలో 5జీ వస్తుంది. వన్ ప్లస్ లో 9, 10 సిరీస్ అన్నింటిలో జియో 5జీ పని చేస్తుంది. జియోమీ రెడ్ మీ నుంచి వచ్చిన 5జీ ఫోన్లలో సపోర్ట్ చేస్తుంది. రియల్ మీ 9ఐ నుంచి నార్జో సిరీస్ లో కూడా 5జీ సేవలు అందుబాటులో ఉంటాయి. వివోలో వీ25, టీ1ప్రో, ఎక్స్ 80 సిరీస్ లో 5జీని వాడుకోవచ్చు.