Jio 5G Phone : అతి తక్కువ ధరకే 5జీ జియో ఫోన్… మరిన్ని ఫీచర్లతో…
Jio 5G Phone : టెలికాం దిగ్గజమైన రిలయన్స్ జియో 5జీ నెట్వర్క్ ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ క్రమంలో 5జీ స్మార్ట్ ఫోన్ లను కూడా రిలీజ్ చేసేందుకు పనిచేస్తుంది. వచ్చే సంవత్సరం జియో ఫోన్ 5జీ ని ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావాలని డిసైడ్ అయింది. అయితే ఈసారి విభిన్న వేరియంట్లలో జియో ఫోన్ 5జిను తీసుకురానిందని ఓ సంస్థ వెల్లడించింది. డిఫరెంట్ స్క్రీన్ సైజులు, స్పెసిఫికేషన్ లు, విభిన్న స్టోరేజ్ ఆప్షన్ తో వేరియంట్లు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. ఈ జియో ఫోన్ 5జీ ధరలు తక్కువగా ఉంటాయని గత ఫోన్లతో పోలిస్తే హార్డ్వేర్ డిజైన్ పరంగా అప్డేట్స్ ఉంటాయని అంచనా వేసింది.
జియో ఫోన్ 5జీ రూ. 8000 నుంచి 12 వేల లోపు ధరతో వస్తుందని అంటున్నారు. ఈ ధర రేంజ్ లోనే అన్ని వేరియంట్లు ఉండే అవకాశం ఉందని తెలిపింది. 5జీ నెట్వర్క్ ను ఎక్కువ ప్రాంతాలకు విస్తరించిన తర్వాత జియో ఫోన్ 5జీ ని మార్కెట్లోకి తీసుకురావాలని జియో భావిస్తుందట. అలాగే 5జీ మిల్లీమీటర్ వేవ్+సబ్-6 గిగా హెర్ట్జ్ కు సపోర్ట్ చేసే 5జీ ఫోను కూడా అనంతరం తీసుకువచ్చే అవకాశం ఉందని తెలిపింది. జియో ఫోన్ 6.5 ఇంచుల హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేతో వస్తుందని తెలుస్తుంది.
అలాగే ఈ జియో ఫోన్ ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఓఎస్ తో రన్ కానుంది. ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్ ఈ ఫోన్లో ఉంటుందని సమాచారం. ఈ ఫోన్లో 13 మెగా పిక్సెల్ ప్రైమరీ 2 మెగా పిక్సెల్ మైక్రో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండొచ్చు. 4జిబి ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ వస్తుందని తెలుస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చు. డ్యుయల్ సిమ్, 5జీ, 4జీ, ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, యుఎస్బి, టైప్ సి, ఫోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉండవచ్చు.