Netflix Amazon Prime : ఏంటి…నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉచితమా ?
Netflix Amazon Prime : ఈ రోజుల్లో జనాలు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఓటీటీపై డిపెండ్ అవుతున్నారు. థియేటర్స్‌లో ఎన్ని సినిమాలు వచ్చిన ఓటీటీపై ఎక్కువగా ఆధార పడుతున్నారు. ఈ క్రమంలోనే దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ జియో అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఒటీటీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లతో డజను OTT సేవల నుండి కంటెంట్‌ను చూసే అవకాశాన్ని పొందుతారు. రూ. 175 ధర కలిగిన మొదటి ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో రానుండగా, ఇందులో 10జీబీ […]
ప్రధానాంశాలు:
Netflix Amazon Prime : ఏంటి... నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉచితమా ?
Netflix Amazon Prime : ఈ రోజుల్లో జనాలు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఓటీటీపై డిపెండ్ అవుతున్నారు. థియేటర్స్‌లో ఎన్ని సినిమాలు వచ్చిన ఓటీటీపై ఎక్కువగా ఆధార పడుతున్నారు. ఈ క్రమంలోనే దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ జియో అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఒటీటీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లతో డజను OTT సేవల నుండి కంటెంట్‌ను చూసే అవకాశాన్ని పొందుతారు. రూ. 175 ధర కలిగిన మొదటి ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో రానుండగా, ఇందులో 10జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. కాలింగ్ మరియు ఎస్ఎంఎస్ వంటివి అందుబాటులో ఉండవు. రెండవ ప్లాన్ ధర రూ. 449. ఈ రీఛార్జ్‌పై మీరు 28 రోజుల వాలిడిటీతో 2GB డైలీ డేటాను పొందుతారు.
Netflix Amazon Prime బంపర్ ఆఫర్..
ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 SMS వంటి ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌లు వరుసగా 10, 12 OTT సేవల ప్రయోజనాన్ని అందిస్తాయి. ఈ జాబితాలో SonyLIV, ZEE5, JioCinema ప్రీమియం మొదలైనవి ఉన్నాయి…ఇక . రూ. 1,299 మొదటి ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ 2GB డైలీ డేటాతో లభిస్తుంది. రూ. 1,799 రెండవ ప్లాన్‌లో Netflix బేసిక్ సబ్‌స్క్రిప్షన్ 3GB డైలీ డేటాతో లభిస్తుంది. ఉచిత ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌తో జియో ప్లాన్ 84 రోజుల వాలిడిటీ కూడా వసతుంది. అలానే రోజువారి 2 జీబీ డేటా వస్తుంది. ఇక రూ. 1029 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే, మీరు అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్రయోజనాలను పొందుతారు.
మూడు నెలల పాటు డిస్నీ + హాట్‌స్టార్ మెంబర్‌షిప్ కావాలంటే, రూ. 949 ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. ఇది 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలతో పాటు ఇది రీఛార్జ్‌పై 2GB డైలీ డేటాను కూడా అందిస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కస్టమర్‌లకు 90 రోజుల పాటు అందించబడుతోంది. మీరు గేమింగ్, క్రీడలను ఇష్టపడితే 365 రోజుల చెల్లుబాటుతో వచ్చే రూ. 3,999 ప్లాన్‌తో ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందే అవకాశం ఉంది. మీరు సంగీతం వినడానికి ఇష్టపడితే మీరు రెండు ప్లాన్‌లతో JioSaavn ప్రో బెనిఫిట్స్ పొందుతారు. ఈ ప్లాన్‌ల ధర రూ.889, రూ.329. మొదటి ప్లాన్ 84 రోజుల వాలిడిటీని అందిస్తుంది. రెండవది 329 రోజుల వాలిడిటీతో వస్తుంది.