Daaku Maharaaj : డాకు మహరాజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అంటే..!
ప్రధానాంశాలు:
Daaku Maharaaj : డాకు మహరాజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అంటే..!
Daaku Maharaaj : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ Balakrishna మంచి స్వింగ్ లో ఉన్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ Daaku Maharaj థియేటర్స్ లో సత్తా చాటింది. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై సూపర్ హిట్ అందుకుంది. బాలయ్య బాబు మాస్ యాక్షన్ చూసి నందమూరి అభిమానులతో పాటు అశేష ప్రేక్షకలోకం పూనకాలెత్తిపోతున్నారు.
Daaku Maharaaj ఓటీటీ టైం ఫిక్స్..
థియేటర్స్‌లో సందడి చేసిన డాకు మహరాజ్ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. బాలకృష్ణ ఇమేజ్ లోబడి.. మాస్, కమర్షియల్ అంశాలకు పెద్ద పీట వేసి రూపొందించిన ఎమోషనల్ డ్రామా డాకు మహారాజ్. అయితే ఫస్టాఫ్‌ను బ్రహ్మండంగా ఎలివేట్ చేసినప్పటికీ.. క్లైమాక్స్‌లో సింపుల్‌గా ముగించేసి.. తడబాటుకు గురయ్యాడా? అనే ఫీలింగ్ కలుగుతుంది. బోయపాటి Boyapati srinu రేంజ్‌లో మాస్ డైలాగ్స్ ఇంకా జొప్పించి ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది.
ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ Netflix డాకు మహారాజ్ డిజిటల్ స్ట్రీమింగ్ netflix హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ డీల్ జరిగినట్లు సమాచారం. అయితే ఈ వారంలోనే డాకు మహారాజ్ ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తుండటం ఆసక్తికర అంశం. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో డాకు మహారాజ్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుందట. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుందని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.