Jio New Plan : రూ.1234 ప్లాన్‌తో ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీ.. డేటా, కాలింగ్,ఎస్ఎంఎస్‌తో స‌హా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jio New Plan : రూ.1234 ప్లాన్‌తో ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీ.. డేటా, కాలింగ్,ఎస్ఎంఎస్‌తో స‌హా..!

 Authored By ramu | The Telugu News | Updated on :9 August 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Jio New Plan రూ.1234 ప్లాన్‌తో ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీ.. డేటా, కాలింగ్,ఎస్ఎంఎస్‌తో స‌హా..!

Jio New Plan : దేశంలోని అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌ అయిన జియో ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం మరోసారి ఆసక్తికరమైన ప్లాన్లను తీసుకొచ్చింది. ముఖ్యంగా జియోభారత్‌ ఫోన్‌ వాడుతున్న వినియోగదారులకు అనుకూలంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందించే మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్లు విడుదల చేసింది – రూ.123, రూ.234, రూ.1234.

Jio New Plan రూ1234 ప్లాన్‌తో ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీ డేటా కాలింగ్ఎస్ఎంఎస్‌తో స‌హా

Jio New Plan : రూ.1234 ప్లాన్‌తో ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీ.. డేటా, కాలింగ్,ఎస్ఎంఎస్‌తో స‌హా..!

Jio New Plan : మంచి ప్లాన్స్..

రూ.123 రీఛార్జ్ ప్లాన్: అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్, రోజుకు 0.5GB డేటా (మొత్తం 7GB), 300 SMSలు, 14 రోజుల వ్యాలిడిటీ, JioSaavn, JioTV యాప్‌ ల సపోర్ట్. ఈ ప్లాన్ ప్రత్యేకంగా తక్కువ కాల్‌, డేటా వినియోగించే గ్రామీణ యూజర్లకు ఎంతో అనుకూలంగా ఉంది. రూ.234 ప్లాన్: 2 నెలల వరకు టెన్షన్ లేదు! ఈ ప్లాన్‌ ద్వారా లభించే ఫీచర్లు చూస్తే.. 58 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 0.5GB డేటా (మొత్తం 28GB), అన్‌లిమిటెడ్‌ కాలింగ్, ప్రతి 28 రోజులకు 300 SMSలు (మొత్తం 600 SMSలు), JioSaavn, JioTV యాప్‌లు

రూ.1234 ప్లాన్: ఏడాదికి దగ్గరగా టెన్షన్‌ లేని ప్యాక్. లాంగ్ టెర్మ్ ప్లాన్‌లో 336 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 0.5GB డేటా (మొత్తం 168GB), ప్రతి 28 రోజులకు 300 SMSలు, అన్‌లిమిటెడ్‌ కాలింగ్, JioSaavn, JioTV యాప్‌ల యాక్సెస్. తక్కువ ఖర్చుతో ఏడాది మొత్తానికి రీఛార్జ్ చేయాలని కోరుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్. దేశంలో ఇప్పటికీ అనేక మంది ఫీచర్‌ ఫోన్‌లను వాడుతున్నారు. వీరి కోసం జియో జియోభారత్‌ ఫోన్లు అందుబాటులోకి తీసుకొచ్చి, 4G స్పీడ్‌ డేటా, ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్‌తోపాటు మెరుగైన కాలింగ్ సదుపాయాలను చౌకగా అందిస్తోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది