Maruti suzuki : ప్రస్తుత కాలంలో చాలామంది కారులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్ల తయారీ కంపెనీలు కూడా మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్ ను తీసుకు వస్తున్నాయి. దేశంలోనే దిగ్గజ కార్ల తయారీ కంపెనీగా కొనసాగుతున్న మారుతి సుజుకి ఇండియా మరో కొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త కార్ లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఎక్కువ మైలేజ్ కూడా ఇస్తుంది. తాజాగా మారుతి సుజుకి ఆల్టో టూర్ హెచ్ 1 పేరుతో కొత్త మోడల్ తీసుకువచ్చింది. ఇది కమర్షియల్ విభాగానికి చెందిన మోడల్.
బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా దీనిని తయారు చేశారు. ఇందులో ఏబీఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. మారుతీ సుజుకీ అల్టో టూర్ హెచ్ 1 మోడల్ ధర రూ. 4.8 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. 1 లీటర్ 5 ఎంటీ పెట్రోల్ మోడల్‌కు ఈ రేటు వర్తిస్తుంది. అలాగే సీఎన్‌జీ వేరియంట్ దీని ధర రూ. 5.7 లక్షలుగా ఉంది. ఇది కూడా ఎక్స్‌షోరూమ్ ధరమ్. ఈ కొత్త మోడల్ మూడు కలర్ ఆప్షన్ల లో కస్టమర్లకు అందుబాటులో ఉంది. మెటాలిక్ సిల్కీ సిల్వర్ గ్రానైట్ గ్రే తెలుపు రంగుల ఈ కారు అందుబాటులో ఉంది.
ఇందులో కంపెనీ కే సిరీస్ 1.0 ఎల్ డ్యూయెల్ జెట్, డ్యూయెల్ వీవీటీ ఇంజిన్ అమర్చారు. అదిరే పనితీరు, అధిక మైలేజ్ ఈ మోడల్ సొంతం అని చెప్పుకోవచు. పెట్రోల్ వేరియంట్ టూర్ హెచ్1 మోడల్ లీటరుకు 24.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. అదే సీఎన్‌జీ వేరియంట్ అయితే కేజీ కి 34.46 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కారులో స్పీడ్ లిమిట్ సిస్టం, ఇంజన్ ఇమిబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అన్నిటికి మించి తక్కువ ధరలో అధిక మైలేజ్ తో ఈ కారు లభిస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.