Maruti suzuki : మార్కెట్లోకి కొత్త కారు ..ధర తక్కువ , మైలేజ్ ఎక్కువ .. పూర్తి వివరాలు ఇవే ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Maruti suzuki : మార్కెట్లోకి కొత్త కారు ..ధర తక్కువ , మైలేజ్ ఎక్కువ .. పూర్తి వివరాలు ఇవే ..!

Maruti suzuki : ప్రస్తుత కాలంలో చాలామంది కారులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్ల తయారీ కంపెనీలు కూడా మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్ ను తీసుకు వస్తున్నాయి. దేశంలోనే దిగ్గజ కార్ల తయారీ కంపెనీగా కొనసాగుతున్న మారుతి సుజుకి ఇండియా మరో కొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త కార్ లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఎక్కువ మైలేజ్ కూడా ఇస్తుంది. తాజాగా మారుతి సుజుకి ఆల్టో టూర్ హెచ్ 1 […]

 Authored By aruna | The Telugu News | Updated on :11 June 2023,7:00 pm

Maruti suzuki : ప్రస్తుత కాలంలో చాలామంది కారులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్ల తయారీ కంపెనీలు కూడా మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్ ను తీసుకు వస్తున్నాయి. దేశంలోనే దిగ్గజ కార్ల తయారీ కంపెనీగా కొనసాగుతున్న మారుతి సుజుకి ఇండియా మరో కొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త కార్ లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఎక్కువ మైలేజ్ కూడా ఇస్తుంది. తాజాగా మారుతి సుజుకి ఆల్టో టూర్ హెచ్ 1 పేరుతో కొత్త మోడల్ తీసుకువచ్చింది. ఇది కమర్షియల్ విభాగానికి చెందిన మోడల్.

బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా దీనిని తయారు చేశారు. ఇందులో ఏబీఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. మారుతీ సుజుకీ అల్టో టూర్ హెచ్ 1 మోడల్ ధర రూ. 4.8 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. 1 లీటర్ 5 ఎంటీ పెట్రోల్ మోడల్‌కు ఈ రేటు వర్తిస్తుంది. అలాగే సీఎన్‌జీ వేరియంట్ దీని ధర రూ. 5.7 లక్షలుగా ఉంది. ఇది కూడా ఎక్స్‌షోరూమ్ ధరమ్. ఈ కొత్త మోడల్ మూడు కలర్ ఆప్షన్ల లో కస్టమర్లకు అందుబాటులో ఉంది. మెటాలిక్ సిల్కీ సిల్వర్ గ్రానైట్ గ్రే తెలుపు రంగుల ఈ కారు అందుబాటులో ఉంది.

Maruti suzuki India new car in low price

Maruti suzuki India new car in low price

ఇందులో కంపెనీ కే సిరీస్ 1.0 ఎల్ డ్యూయెల్ జెట్, డ్యూయెల్ వీవీటీ ఇంజిన్ అమర్చారు. అదిరే పనితీరు, అధిక మైలేజ్ ఈ మోడల్ సొంతం అని చెప్పుకోవచు. పెట్రోల్ వేరియంట్ టూర్ హెచ్1 మోడల్ లీటరుకు 24.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. అదే సీఎన్‌జీ వేరియంట్ అయితే కేజీ కి 34.46 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కారులో స్పీడ్ లిమిట్ సిస్టం, ఇంజన్ ఇమిబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అన్నిటికి మించి తక్కువ ధరలో అధిక మైలేజ్ తో ఈ కారు లభిస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది