Mothers Day : మ‌దర్స్ డే రోజు మీ అమ్మ‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌లుగా ఈ ఫోన్స్ ప్లాన్ చేయండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mothers Day : మ‌దర్స్ డే రోజు మీ అమ్మ‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌లుగా ఈ ఫోన్స్ ప్లాన్ చేయండి..!

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :11 May 2025,6:00 pm

Mothers Day : మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్కరు త‌మ త‌ల్లులకి అరుదైన గిఫ్ట్స్ ఇచ్చే ప్లాన్స్ చేస్తుంటారు. మే 11న మదర్స్ డే సందర్భంగా కొంత టెక్ గాడ్జెట్లపై అవగాహన ఉంటే.. వీటిని గిఫ్ట్స్ గా ఇవ్వొచ్చు. రూ. 10వేల లోపు కొన్ని బెస్ట్ టెక్ గిఫ్ట్స్ సొంతం చేసుకోవచ్చు. మీ మదర్ ఉదయం ఎక్కువగా వాకింగ్ ఇష్టపడేవారు అయితే, గాడ్జెట్‌లు ఇవ్వొచ్చు. ఇవి హార్ట్ రేటు ట్రాకింగ్, ఆక్సిజన్ లెవల్స్, అడుగుల సంఖ్య, నిద్ర ఒత్తిడి స్థాయిలను కూడా ట్రాక్ చేయొచ్చు.

Mothers Day మ‌దర్స్ డే రోజు మీ అమ్మ‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌లుగా ఈ ఫోన్స్ ప్లాన్ చేయండి

Mothers Day : మ‌దర్స్ డే రోజు మీ అమ్మ‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌లుగా ఈ ఫోన్స్ ప్లాన్ చేయండి..!

Mothers Day ఇవి బెస్ట్ ఆప్ష‌న్స్..

అమెజాన్ ,ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్, నాయిస్, ఫాస్ట్రాక్, బోట్ మరిన్ని బ్రాండ్‌ల నుంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటి పనులు చేసుకుంటూ లేదా రెస్ట్ తీసుకుంటూ మ్యూజిక్ వినడానికి ఇష్టపడే తల్లులకు వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు బెస్ట్ ఆప్షన్ కావచ్చు. గూగుల్, నథింగ్, బోట్ వంటి బ్రాండ్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో రూ. 10వేల లోపు కొన్ని ఆప్షన్లను అందిస్తున్నాయి.మీ అమ్మ తన జుట్టును స్టైలింగ్ చేసుకోవడం ఇష్టపడితే హెయిర్ స్టైలింగ్ అప్లియన్సెస్ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు వేగా, హావెల్స్ ఈ కాంబోలను సరసమైన ధరలకు ఆన్‌లైన్‌లో టాప్ బ్రాండ్‌లలో ఉన్నాయి.

వంటగదిలో లేదా లివింగ్ రూమ్‌లో పెట్టుకునేందుకు మీ అమ్మకు స్మార్ట్ స్పీకర్ బహుమతిగా ఇవ్వాల‌ని అనుకుంటే అమెజాన్ ఎకో డాట్, ఎకో పాప్ అనేవి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో అందుబాటులో ఉన్న రెండు పాపులర్ ఆప్షన్లుగా చెప్పొచ్చు. ఇన్‌స్టంట్ పోలరాయిడ్ కెమెరా మీ అమ్మకు కొన్ని సెకన్లలోనే ప్రత్యేక జ్ఞాపకాలను ప్రింట్ చేసి ఇస్తుంది. ఆమె ఫొటోలను ఇష్టపడితే లేదా పాత జ్ఞాపకాలను ఇష్టపడితే అద్భుతమైన బహుమతి. ఫుజిఫిల్మ్ ఇన్‌స్టాక్స్ మినీ సిరీస్ ఈ కేటగిరీలో అత్యంత ఇష్టపడే వాటిలో ఒకటిగా చెప్పొచ్చు. మరి వీటిలో ఏది బ‌హుమ‌తిగా ఇవ్వాల‌ని అనుకుంటున్నార‌నేది మీ ఆప్ష‌న్.

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది