Amazon : మోసం చేసిన అమెజాన్.. ట్యాబ్ బుక్ చేస్తే స‌బ్బులు వ‌చ్చాయి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amazon : మోసం చేసిన అమెజాన్.. ట్యాబ్ బుక్ చేస్తే స‌బ్బులు వ‌చ్చాయి..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 June 2025,5:00 pm

Amazon : ఆన్ లైన్ బిజినెస్ బాగా పెర‌గ‌డంతో ప్రతిదీ మన దగ్గరకు వచ్చేస్తుంది. అయితే అది అసలా..? నకిలీనా..? తక్కువ ధరకు లభిస్తుంది అంటే.. అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే.. తొందరపడి బుక్ చేశామో అంతే సంగతులు.. తాజాగా ట్యాబ్ ఆర్డర్ చేస్తే.. లైఫ్‌బాయ్ సబ్బులు ఇంటికొచ్చాయి.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది..

Amazon : పెద్ద మోస‌మే..

వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న సుబ్బారావు అనే వ్యక్తి తన భార్య కోసం ట్యాబ్‌ను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టాడు. వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చినటువంటి ఆర్డర్ ఓపెన్ చేయగా అందులో ట్యాబ్ కి బదులు లైఫ్ బాయ్ సబ్బులు కనిపించాయి.. దీంతో కస్టమర్ ఒక్కసారిగా కంగుతిన్నాడు.

Amazon మోసం చేసిన అమెజాన్ ట్యాబ్ బుక్ చేస్తే స‌బ్బులు వ‌చ్చాయి

Amazon : మోసం చేసిన అమెజాన్.. ట్యాబ్ బుక్ చేస్తే స‌బ్బులు వ‌చ్చాయి..!

తన భార్య యూట్యూబ్‌లో వీడియోస్ చేసుకుంటుందని సుబ్బారావు అనే వ్యక్తి అమెజాన్ లో ఓ ట్యాబ్ (tab) ని బుక్ చేశాడు.. ఆ ట్యాబ్ ధర 18,000.. మూడు రోజుల తర్వాత అమెజాన్ నుంచి ఓ ఆర్డర్ వచ్చింది.. సరే, ఆర్డర్ పెట్టిన టాబ్ ఆర్డర్ వచ్చిందని సంతోషంగా రిసీవ్ చేసుకున్నాడు సుబ్బారావు… తీరా ఆర్డర్నీ ఓపెన్ చేసి చూడగా షాక్ కి గురయ్యారు.. అందులో నాలుగైదు లైఫ్ బాయ్ సబ్బులతోపాటు మొబైల్ ఫోన్లకు సంబంధించినటువంటి బాక్సులను ఆర్డర్ ప్యాక్‌లో పెట్టారు. ఇది చూసినటువంటి కస్టమర్స్ ఒకసారి గా షాక్‌కి గురయ్యారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది