5G Network Issues : స్మార్ట్ ఫోన్ లో 5జీ నెట్వర్క్ పొందాలి అనుకుంటున్నారా…అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

5G Network Issues : స్మార్ట్ ఫోన్ లో 5జీ నెట్వర్క్ పొందాలి అనుకుంటున్నారా…అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి…!

5G Network Issues : గతంలో 2G 3G 4G వంటి ఇంటర్నెట్ స్పీడ్ చాలా మంది చూసే ఉంటారు. అయితే ప్రస్తుతం 5G కాలం నడుస్తుంది. ఇది 4G కంటే వేగంగా పనిచేస్తుంది. 5G నెట్వర్క్ హై స్పీడ్ వల్ల ఎలాంటి ఫొటోస్ అయిన వీడియోస్ అయినా లెంత్ ఎక్కువగా ఉన్న క్వాలిటీ వీడియోలైనా క్షణాలలో డౌన్లోడ్ అవుతున్నాయి. అలాగే యాప్స్ డౌన్లోడింగ్ కి కూడా ఎక్కువ సమయం పట్టడం లేదు. అదేవిధంగా ఎలాంటి సైట్స్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 July 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  5G Network Issues : స్మార్ట్ ఫోన్ లో 5జీ నెట్వర్క్ పొందాలి అనుకుంటున్నారా...అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి...!

5G Network Issues : గతంలో 2G 3G 4G వంటి ఇంటర్నెట్ స్పీడ్ చాలా మంది చూసే ఉంటారు. అయితే ప్రస్తుతం 5G కాలం నడుస్తుంది. ఇది 4G కంటే వేగంగా పనిచేస్తుంది. 5G నెట్వర్క్ హై స్పీడ్ వల్ల ఎలాంటి ఫొటోస్ అయిన వీడియోస్ అయినా లెంత్ ఎక్కువగా ఉన్న క్వాలిటీ వీడియోలైనా క్షణాలలో డౌన్లోడ్ అవుతున్నాయి. అలాగే యాప్స్ డౌన్లోడింగ్ కి కూడా ఎక్కువ సమయం పట్టడం లేదు. అదేవిధంగా ఎలాంటి సైట్స్ అయిన చాలా త్వరగా ఓపెన్ అవుతున్నాయి. కానీ 5G నెట్వర్క్ ఫోన్ ఉన్న వారంతా దీనిని ఉపయోగించలేరు. ఎందుకంటే కొంతమంది 4G నెట్వర్క్ దగ్గరే ఉన్నారు. అయితే 5G నెట్వర్క్ హై స్పీడ్ పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం…..

5G Network Issues 5G లోని రకాలు

5G స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ హై స్పీడ్ నీ పొందలేరు ఎందుకంటే 5G సేవలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరియు ఎయిర్టెల్ 5G NSA నెట్వర్క్ ఉపయోగిస్తుంది. జియో 5G SA తన సొంత టెక్నాలజీని వాడుతుంది. అయితే ప్రస్తుతం 5G స్మార్ట్ ఫోన్లలో NSE టెక్నాలజీని ఎక్కువగా వినియోగించబడుతుంది. దీని కారణంగా జియో SA టెక్నాలజీ వాడేటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

5G Network Issues మీ సిమ్ సపోర్ట్ చేస్తుందా

స్మార్ట్ ఫోన్లలో 5G సపోర్ట్ నీ కలిగి ఉన్న కాని కొన్ని పరికరాలు మాత్రం పాతవి గా ఉన్నాయి. అలాగే 5G స్మార్ట్ ఫోన్లలో ప్రాథమిక సిమ్ కార్డులో లేదా మొదటి ప్లాట్ లో మాత్రమే 5G సపోర్ట్ ని కలిగి ఉంటుంది. ఒకవేళ మీకు ఇంటర్నెట్ ఇష్యూ గనుక ఉన్నట్లయితే మీ సిమ్ కార్డ్ మొదటి స్లాట్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి.

ఫోన్ నెంబర్ 5G యాక్టివ్ గా ఉందా..

5G కోసం ప్రత్యేకంగా రీఛార్జి ప్లాన్ ఏమీ లేదు. ఎయిర్టెల్ మరియు జియో కంపెనీలు యూజర్లకు ఫ్రీగా అన్ లిమిటెడ్ 5G సేవలను అందించడం జరుగుతుంది. దీని కోసం నిర్దిష్ట ప్లాన్ లో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. జియో మరియు ఎయిర్టెల్ కంపెనీల యాప్ లోకి వెళ్లి 5G సర్వీస్ యాక్టివ్ చేసుకోవాలి. దీని కోసం మై జియో మరియు ఎయిర్టెల్ థాంక్స్ యాప్ కి వెళ్లడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

సిమ్ ని అప్ గ్రేడ్ చేయాలా….

4G సిమ్ వాడుతున్నవారు ప్రస్తుతం 5G హై స్పీడ్ నీ పొందాలనుకుంటున్నారు. ఒకవేళ మీ సిమ్ కార్డు 3G అయితే దానిని 5Gకి మార్చడం కుదరదు. అలాగే మీ సిమ్ 3G సిమ్ నుంచి 4G లోకి మార్చవచ్చు. కానీ 5G లోకి మార్చలేరు. అందుకోసమే మీరు 4G సిమ్ కార్డును తీసుకోవాలి.

5G Network Issues స్మార్ట్ ఫోన్ లో 5జీ నెట్వర్క్ పొందాలి అనుకుంటున్నారాఅయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి

5G Network Issues : స్మార్ట్ ఫోన్ లో 5జీ నెట్వర్క్ పొందాలి అనుకుంటున్నారా…అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి…!

సెట్టింగుల్లో ఈ మార్పులు చేసుకోండి..

మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్లలో 4G లేదా 5G టైప్ సెలెక్ట్ చేసుకున్నారని దీనిని కన్ఫర్మేషన్ చేసుకోవాలి. దీని వలన మీ స్మార్ట్ ఫోన్ నెట్వర్క్ ఆటోమేటిక్ గా 4G లేదా 5G గా రన్ అవ్వడం జరుగుతుంది. మీరు 5G నెట్వర్క్ సిగ్నల్ వీక్ గా ఉండే ప్రదేశంలొ ఉన్నట్లయితే వెంటనే 4G ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. ఒకవేళ మీరు 5Gని మాత్రమే పొందాలి అనుకుంటే మాత్రం మీ ఫోన్ సెట్టింగ్ లో 5G నెట్వర్క్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది