5G In INDIA : అక్టోబర్ నుంచి ఈ 13 సిటీల్లో 5జీ సేవలు… మీ సిటీ ఉందో లేదో చెక్ చేసుకోండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

5G In INDIA : అక్టోబర్ నుంచి ఈ 13 సిటీల్లో 5జీ సేవలు… మీ సిటీ ఉందో లేదో చెక్ చేసుకోండి…

 Authored By aruna | The Telugu News | Updated on :26 August 2022,7:30 am

5G In INDIA : మనదేశంలో అక్టోబర్ నుంచి ఐదు జీ సేవలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12 వ తారీకు కల్లా 5జీ సేవలు ఇండియాలో ప్రారంభం అవుతాయని టెలికాం మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం ఇచ్చారు. కంపెనీలకు స్పెక్ట్రమ్ అలోకేషన్ లెటర్లు కూడా అందాయి. అయితే ముందుగా ఈ పదమూడు నగరాల్లో ఈ సేవలను అందించనున్నారు. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగర్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్నగర్, పూణే నగరాల్లో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో అని డేటా నెట్వర్క్ వోడాఫోన్ ఐడియాల నుంచి టెలికాం శాఖకు ఇప్పటికే 17,876 కోట్లు అందాయి. పైన పేర్కొన్న 13 సిటీల్లో మొదటగా 5జి మొదలుకానుంది. ఆ తర్వాత దశలవారీగా 5జీ అందుబాటులోకి తీసుకురానున్నారు. పూర్తిగా దేశం మొత్తం 5జి కవరేజ్ రావాలంటే కనీసం రెండు సంవత్సరాలు పట్టి అవకాశం ఉంది. మన దేశంలో 5జీ టెస్టింగ్ అయితే ఇప్పటికే ప్రారంభమైంది.

కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ అయితే ఇంతవరకు 4జీ ని అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే 5జీని త్వరలో బిఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకురానిందని వార్తలు వస్తున్నాయి. 5జీ సర్వీసుల కోసం బిఎస్ఎన్ఎల్ ఇటీవలే టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కోరింది. ఈ పర్మిషన్ వస్తే త్వరలో బిఎస్ఎన్ఎల్ 4జి, 5జి అందుబాటులోకి రానున్నాయి. కానీ దానికి ముందు చాలా విషయాలు జరగాలి. తీసుకురానున్న బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ 5జీ ఎన్ఎస్ఏ నెట్వర్క్ తో ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. పూర్తిగా బేస్ 4జీ కోర్ నెట్వర్క్ ను నిర్మించడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. 5జి ఎస్ ఏ కంటే ఎన్ఎస్ఎ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండనుంది. ఎందుకంటే 5జీ ఎస్ఏ కు పూర్తిగా కొత్త ఇన్ఫ్రా స్ట్రక్చర్ అవసరం. అంత బడ్జెట్ బిఎస్ఎన్ఎల్ దగ్గర ఉందో లేదో తెలియలేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే బిఎస్ఎన్ఎల్ 5జి 2023 లోని లాంచ్ అయ్యే అవకాశం ఉంది. బిఎస్ఎన్ఎల్ కు మంచిదని చెప్పాలి.

5G In INDIA Launching 5G Services In These 13 Cities

5G In INDIA Launching 5G Services In These 13 Cities

4జీ ఆలస్యం కావడంతో బిఎస్ఎన్ఎల్ కు చాలా డ్యామేజ్ జరిగింది. దీంతో ప్రభుత్వానికి బిఎస్ఎన్ఎల్ కు అప్గ్రేడ్ అవడం అత్యవసరం అని తెలిసి ఉంటుంది. ప్రస్తుతం మొబైల్ నెట్వర్క్ ప్లాన్లలో బిఎస్ఎన్ఎల్ ప్లాన్ లే తక్కువ ధరలో ఉన్నాయి. 5జీలో కూడా చవకైన ప్లాన్ లు తీసుకొస్తే బిఎస్ఎన్ఎల్ తిరిగి టెలికాం రంగంలో ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎఫ్ ఏ కథనం ప్రకారం బిఎస్ఎన్ఎల్ 70 మెగా హెర్జ్స్ బ్యాండ్ కోసం దరఖాస్తు చేసుకుంటే 40 మెగా హెర్జ్ బ్యాండ్ కు మాత్రమే అనుమతి వచ్చినట్లు తెలుస్తోంది. డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ సిఫారసులనే టెలికాం డిపార్ట్మెంట్ ఫాలో అవుతుంది. 70 మెగా హెర్ట్జ్ ఎయిర్ వేవ్స్ ను బిఎస్ఎన్ఎల్ కోసం రిజర్వ్ చేస్తే ప్రైవేటు టెలికాం సంస్థలకు5జీ సేవలకు కొరత ఏర్పడుతుందని టెలికాం డిపార్ట్మెంట్ అభిప్రాయపడుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది