Aadhaar update : ఇకపై ఆధార్ కార్డు అప్డేట్ కోసం ఆధార్ సెంటర్ కు వెళ్లనవసరం లేదు.. మీ ఫోన్లోనే చేసుకోవచ్చు.. ఎలా అంటే !!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: June 19, 2025, 5:00 pm
  •  మీ ఫోన్లోనే మీ ఆధార్ అప్డేట్ & ఫోటో మార్చుకోవచ్చు

  •  Aadhaar update : ఇకపై ఆధార్ కార్డు అప్డేట్ కోసం ఆధార్ సెంటర్ కు వెళ్లనవసరం లేదు.. మీ ఫోన్లోనే చేసుకోవచ్చు.. ఎలా అంటే !!

Aadhaar update : ప్రతి పౌరునికీ ప్రత్యేక గుర్తింపుగా ఉండే ఆధార్ కార్డును క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయడం చాలా అవసరం. ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగ సేవలు పొందేందుకు ఆధార్ ముఖ్యమైన ఆధారంగా మారింది. ఈ నేపథ్యంలో భారత యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ (UIDAI) ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆధార్ కార్డును ప్రతి పదేళ్లకోసారి అప్‌డేట్ చేయాలని సూచించగా, పిల్లల ఆధార్‌ను మాత్రం వారు 15 ఏళ్ల వయస్సు వచ్చే సరికి అప్డేట్ చేయాలన్నారు.

Aadhaar update : ఇకపై ఆధార్ కార్డు అప్డేట్ కోసం ఆధార్ సెంటర్ కు వెళ్లనవసరం లేదు.. మీ ఫోన్లోనే చేసుకోవచ్చు.. ఎలా అంటే !!

Aadhaar update : ఇకపై ఆధార్ కార్డు అప్డేట్ కోసం ఆధార్ సెంటర్ కు వెళ్లనవసరం లేదు.. మీ ఫోన్లోనే చేసుకోవచ్చు.. ఎలా అంటే !!

Aadhaar update : ఆధార్ అప్డేట్ కోసం సరికొత్త యాప్ ను తీసుకరాబోతున్న UIDAI

ఇప్పటివరకు చిరునామా, పేరు, పుట్టిన తేది వంటి వివరాలను ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. కానీ ఫోటో, బయోమెట్రిక్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ మార్పుల కోసం మాత్రం ప్రజలు ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ రానున్న రోజుల్లో ఈ విధానం మారనుంది. UIDAI ప్రకటించిన ప్రకారం.. నవంబర్ నాటికి ఓ కొత్త మొబైల్ యాప్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ యాప్ ద్వారా చాలా ఆధార్ అప్‌డేట్లు ఇంటి నుంచే చేసుకోవచ్చు. కేవలం బయోమెట్రిక్, ఐరిస్ స్కానింగ్ కోసం మాత్రమే కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.

ఈ యాప్ ద్వారా ఆధార్ వివరాల అప్‌డేట్ మరింత సులభతరం కానున్నా, సెక్యూరిటీ అంశాన్ని UIDAI ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకొంది. ఈ కారణంగా ప్రతి అప్‌డేట్‌కు ఓటీపీ ధృవీకరణను తప్పనిసరి చేసింది. దీంతో వివరాలు అప్డేట్ చేయాలంటే మొబైల్ నెంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. ఇందుకోసం లింకింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఒకసారి యాప్ అందుబాటులోకి వస్తే, ప్రజలు ఇంటి నుంచే ఆధార్ కార్డులో మార్పులు చేసుకునే సౌకర్యం పొందవచ్చు. దీనివల్ల ఆధార్ కేంద్రాల వద్ద ఉండే రద్దీ, టైమ్ వేస్ట్ తగ్గుతాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp