Smartphone : నోకియా.. ఈ బ్రాండ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో నోకియా ఫోన్స్ ఉండేవి. ‘నోకియా 3210’ మోడల్‌ను మనం మరచిపోగలమా ? మనలో చాలా మందికి నోకియా 3210ని లగ్జరీ ఫోన్‌గా ఉపయోగించిన రోజులు గుర్తుండే ఉంటాయి. ఈ ఫోన్‌లోని స్నేక్ గేమ్ ఎవరూ మర్చిపోలేరు. ఆ తర్వాత నోకియా నుండి చాలా ఫోన్స్ వచ్చిన కూడా నోకియా 3210కి మాత్రం చాలా పాపులారిటీ దక్కింది. అయితే ఇప్పుడు మార్కెట్‌లోకి నోకియా జీ42 పేరుతో 5జీ ఫోన్ వచ్చింది. ఈ మూవీ ధర చాలా తక్కువే అని చెప్పాలి. తక్కువ ధర కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.
నోకియా జీ 42 5జీ ఫోన్ అసలు ధర రూ. 12,999కాగా అమెజాన్‌లో 23 శాతం డిస్కౌంట్‌తో ర. 9,999కి దక్కుతుంది. ఇక అమెజాన్ పే బ్యాలెన్స్ తో పే చేస్తే రూ. 300 క్యాష్‌బాక్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్‌ను మీ పాత ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకుంటే గరిష్టంగా రూ. 9,450 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇంక ఇందులో ఉన్న ఫీచర్స్ గమనిస్తే.. 6.5 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ 5జీ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 50000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మరోవైపు ఇందులో లిథియం పాలిమార్ బ్యాటరీ ఉంటుంది. బ్లూటూత్, వైఫై, యూఎస్‌బీ, 3.5 ఎమ్‌ఎమ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ని ఒక్కసారి చార్జ్ చేస్తే 26 గంటల టాక్ టైమ్ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.
ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్ ఏఐ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్‌తో పాటు మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్, 2 ఏళ్లు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్, ఏడాది మ్యానిఫ్యాక్చరింగ్ వారంటీ కూడా కంపెనీ అందిస్తున్నారు. మంచి ఫీచర్స్‌తో తక్కువ ధరలో ఫోన్ కొనుక్కోవాలని అనుకునేవారు ఈ ఫోన్ ఎంపిక చేసుకుంటే బెటర్.ఇక ఇదిలా ఉంటే నోకియా 3210 పాత మోడల్ ని కొత్త మార్పులతో ప్రవేశపెట్టింది. కానీ డిజైన్‌తో సహా ఆ పాత కళ దెబ్బతినలేదు.ఈ ఫోన్ 3 కలర్స్ అప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.