RBI Good News : మధ్యతరగతి ప్రజలకు RBI గుడ్ న్యూస్..!
ప్రధానాంశాలు:
RBI Good News : మధ్యతరగతి ప్రజలకు RBI గుడ్ న్యూస్..!
RBI Good News : యుపిఐ (UPI) ద్వారా రోజూ పేమెంట్స్ చేసే వారికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ తెలిపింది. డిజిటల్ పేమెంట్స్ మరింత సులభంగా, ప్రయోజనకరంగా మారాలన్న లక్ష్యంతో తాజాగా RBI కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పర్సన్ టు మర్చంట్ (P2M) మరియు మర్చంట్ టు మర్చంట్ (M2M) యుపిఐ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన లిమిటును పెంచే అధికారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి అప్పగించింది. ఇప్పటివరకు ఈ లిమిట్ రూ.1 లక్షగా ఉండగా, ఇప్పుడు అవసరాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. ఈ మార్పుతో వ్యాపారులకు, పెద్ద మొత్తాల లావాదేవీలు చేసే వారికి ఎంతో ఉపయోగపడనుంది.

RBI Good News : మధ్యతరగతి ప్రజలకు RBI గుడ్ న్యూస్..!
RBI Good News : మీరు యుపిఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా..? అయితే ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు
ఈ నిర్ణయం ప్రధానంగా వ్యాపార వర్గాలకు ప్రయోజనకరంగా ఉండబోతోంది. రోజూ పెద్ద మొత్తాల ఆన్‌లైన్ లావాదేవీలు చేసే వ్యాపారులు ఇకపై అడ్డంకులేని ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ముఖ్యంగా జ్యువెలరీ షాపులు, ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లు, ఈ-కామర్స్ బిజినెస్‌లకు ఇది కలిసొచ్చే నిర్ణయం. అయితే పర్సన్ టు పర్సన్ (P2P) ట్రాన్సాక్షన్స్‌లో ఎలాంటి మార్పు లేదు. అంటే మీరు ఇతర వ్యక్తికి యుపిఐ ద్వారా పంపగలిగే గరిష్ఠ మొత్తం ఇప్పటికీ రూ.1 లక్షగానే ఉంటుంది.
ఈ నిర్ణయం భారతదేశంలో డిజిటల్ ఫైనాన్స్ వ్యవస్థను మరింత ముందుకు నడిపించనుంది. నగదు బదులుగా డిజిటల్ పేమెంట్స్ వినియోగం పెరుగుతుండటంతో పారదర్శకత పెరగడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు మరింత ఉత్సాహం లభిస్తుంది. దీనితోపాటు బ్యాంకులు కూడా ట్రాన్సాక్షన్ లిమిట్స్ పెరగడం వల్ల తమ టెక్నికల్ సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇకపై NPCI మార్కెట్ అవసరాలను అంచనా వేస్తూ బ్యాంకులతో చర్చించి యుపిఐ ట్రాన్సాక్షన్ పరిమితులను అనుసంధానించే కీలక బాధ్యతను వహించనుంది.