RBI Good News : చిన్న పిల్లలు బ్యాంక్ ఖాతాల విషయంలో RBI గుడ్ న్యూస్..!
ప్రధానాంశాలు:
RBI Good News : చిన్న పిల్లలు బ్యాంక్ ఖాతాల విషయంలో RBI గుడ్ న్యూస్..!
RBI Good News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం చిన్న పిల్లల కోసం బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పుకు దారితీసింది. ఇప్పటివరకు మైనర్లు బ్యాంకు ఖాతా తెరవాలంటే తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడి ఆధ్వర్యంలోనే ఉండాల్సి వచ్చేది. కానీ తాజాగా ఆర్బీఐ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. పది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న పిల్లలు స్వతంత్రంగా పొదుపు ఖాతా లేదా టర్మ్ డిపాజిట్ ఖాతాలను తెరచుకుని, నిర్వహించుకునే హక్కు ఇచ్చారు.

RBI Good News : చిన్న పిల్లలు బ్యాంక్ ఖాతాల విషయంలో RBI గుడ్ న్యూస్..!
RBI Good News : చిన్న పిల్లలు బ్యాంక్ ఖాతాల తెరవచ్చు.. RBI నిర్ణయం మంచిదేనా..?
ఆర్బీఐ సూచనల మేరకు.. బ్యాంకులు తమ రిస్క్ మేనేజ్మెంట్ విధానాల ఆధారంగా మైనర్ల ఖాతాలకు పరిమితులు విధించవచ్చు. అంతేగాక పిల్లల ఖాతాలకు అదనపు బ్యాంకింగ్ సదుపాయాలు , ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, చెక్ బుక్ వంటి సేవలు అందించాలా వద్దా అనే నిర్ణయం కూడా బ్యాంకులదే అన్నారు. అయితే ఈ సేవలు అందించేముందు ఖాతాదారులకు నిబంధనలను స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది.
ఈ నిర్ణయం వల్ల పిల్లలు చిన్న వయస్సులోనే ఆర్థిక వ్యవహారాలపై అవగాహన పెంచుకోగలుగుతారు. అయితే అక్రమ లావాదేవీలను నిరోధించేందుకు బ్యాంకులు తమ భద్రతా విధానాలను మరింత కఠినంగా పాటించాల్సి ఉంటుంది. మైనర్లు మెజారిటీ వయస్సు చేరిన తరువాత వారి సంతక నమూనాలను బ్యాంకు రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులతో పిల్లలకు స్వతంత్రత లభించడమే కాదు, భవిష్యత్ ఆర్థిక శ్రద్ధకూ దోహదం చేస్తుందని భావిస్తున్నారు.