Realme 10 Pro Plus : చాలా తక్కువ ధరకే..అదిరిపోయే ఫీచర్లతో రానున్న రియల్ మీ స్మార్ట్ ఫోన్…!
Realme 10 Pro Plus : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉండడంతో మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయినా రియల్ మీ వరుసగా తన ఫోన్ లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అందరికీ అందుబాటులోకి వచ్చేలా అతి తక్కువ ధరకే మంచి ఫీచర్లతో కూడిన ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే రియల్ మీ తాజాగా 10 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు రెడీగా ఉంది. ఈ 10 సిరీస్ లో భాగంగా రియల్ మీ 10 ప్రో, రియల్ మీ 10 ప్రో + పేరుతో ఫోన్లను తీసుకురాబోతుంది.
నవంబర్ 9వ తేదీన మార్కెట్లోకి 10 సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నారు. రియల్ మీ 10 ప్రో స్మార్ట్ ఫోన్లో మీడియా టెక్ హీలియో జీ99 ప్రాసెసర్ ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ, 4 జీబీ + 64 జీబీ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్లలో వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో మెమొరీ కార్డుతో ర్యామ్ కెపాసిటీ పెంచుకోవచ్చు. ఈ ఫోన్లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా రాబోతుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్లో 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5000 mAh బ్యాటరీ కలిగి ఉంది. దాదాపు అన్ని మోడల్స్ లోను ఇదే ఫీచర్లు రాబోతున్నాయి. అయితే రియల్ మీ 10 ప్రో స్మార్ట్ ఫోన్లో 120 హెర్జ్ రిక్వెస్ట్ రేటుతో అమోలెడ్ డిస్ప్లేను అందించనున్నారు. మీడియా టెక్ డైమన్సిటీ 1080 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇక ఇందులో మరింత పవర్ఫుల్ బ్యాటరీ ఇవ్వనున్నారు. 65 వాట్స్ చార్జింగ్ కు సపోర్ట్ చేసి 4890 ఎంఏహెచ్ బ్యాటరీ అందించబోతున్నారు. ఇక ఈ రియల్ మీ 10 సిరీస్ ఫోన్ ధరల విషయానికి వస్తే 15000 నుంచి 25 వేల మధ్య ఉంటాయని కంపెనీ తెలిపింది.