Realme Smartphone : రూ.7వేలు డిస్కౌంట్ ఆఫర్ తో… రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్…

Authored By aruna | The Telugu News | Published on: September 18, 2022, 8:00 am

Realme Smartphone : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. ఎక్కడికైనా వెళ్లాలంటే జేబులో పర్స్ మర్చిపోతాం ఏమో కానీ సెల్ ఫోన్ మాత్రం అసలు మర్చిపోం. అంతగా ఫోన్లకి అలవాటు పడిపోయాం. చాలామంది ఇంట్లో కూర్చుని ఫోను ద్వారా అన్ని పనులను చేసుకుంటున్నారు. అందుకే ఫోన్ కి బాగా డిమాండ్ పెరుగుతుంది. ఫోన్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఫోన్ అనేది అవసరం కాబట్టి అది ఎంత ధర ఉన్నా కొనుగోలు చేస్తున్నారు.

ఇండియన్ మార్కెట్లోకి చైనా కు సంబంధించిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ కొత్త ఫోను లాంచ్ చేసింది. రియల్ మీ జిటి నియో 3టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో విడుదల అయింది. అయితే ఇండియాలో సెప్టెంబర్ 23 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ మూడు వేరియంట్ ధరలలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్ + 128 జీబీ ర్యామ్ ధర రూ.29,999, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999, 8జీబీ ర్యామ్ + 256జీబీ ధర రూ.33,999. ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా ఈ ఫోన్ 7000 డిస్కౌంట్ లభించనుంది.

Realme launches new smartphone on Flipkart with discount offer

Realme launches new smartphone on Flipkart with discount offer

ఇక ఈ ఫోన్ ఫీచర్లు విషయానికి వస్తే ఈ ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేటు తో కూడిన 6.62 అంగుళాలు ఈ4 అమోలెడ్ డిస్ప్లే ను అందించారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం తో పనిచేస్తుంది. అలాగే 80 వాట్ సూపర్ డార్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 12 నిమిషాల్లో 50% చార్జింగ్ కావడం ఈ ఫోన్ ప్రత్యేకత. ఇక ఈ ఫోన్ లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ తో కూడిన ఫ్రంట్ కెమెరా ఉంది.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp