Beauty Tips : ఎంతటి నలుపుగా ఉన్న ముఖమైన తెల్లగా మారిపోతుంది. ఈ చిట్కాని పాటిస్తే మీరు అవాక్ అవుతారు…
Beauty Tips : ఎవరికైనా సరే అందంగా ఉండాలని కోరిక ఉంటుంది. తెల్లగా మెరిసిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే కొందరు నలుపు మొహం చూసుకొని బాధపడుతూ ఉంటారు. ఇలాంటివారు తెల్లగా కనిపించాలని పార్లర్కు వెళ్లి పలు రకాల ఫేషియల్సు, మాస్కులు అంటూ ఎన్నో ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు. అయితే ఇలాంటి ఎన్నో ఫేషియల్స్ వాడిన ఎటువంటి రిజల్ట్ ఉండదు. కొన్ని శుభకార్యాలకు కొన్ని పండుగలకు ఇలా పార్లర్కి వెళ్లి ఈ విధంగా ఫేస్ మాస్కులు అంటూ ఎన్నో చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సులభంగా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మీ ఫేస్ ని కాంతివంతంగా మెరిసిపోయేలా అందంగా తయారు చేసుకోవచ్చు. ఇక ఈ టిప్ కోసం ఒక బౌల్ తీసుకొని దాన్లో ఒక స్పూన్ ముల్తాన్ మట్టిని వేసుకోవాలి. దీనికి బదులుగా సెనగపిండిని కూడా వాడుకోవచ్చు. తర్వాత ఆరెంజ్ పీల్ పౌడర్ ని కూడా వేసుకోవచ్చు.
అలాగే దీనిలో ఒక స్పూన్ కాఫీ పౌడర్ కూడా వేసుకోవాలి. దీనిలో కెఫిన్ అనే పదార్థం ఉండడం వలన చర్మంపై ఉన్నటువంటి టాన్ ను తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మం తెల్లగా చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఒక బౌల్ లో ఒక చెంచా పెరుగును కూడా తీసుకోవాలి. ఈ పెరుగు ఫేస్ పై ఉన్నటువంటి మురికి, జిడ్డును తొలగించడంలో బాగా సహాయపడుతుంది. తర్వాత ఒక చెంచా పీల్ ఆఫ్ మాస్క్ కూడా తీసుకోవాలి. ఇది మనకి మార్కెట్లో తక్కువ ధరకే దొరుకుతుంది. కావున దానికోసం మన ఇంట్లో ఉండే పదార్థాలను మాత్రమే వినియోగిస్తున్నాము. ఒక ఫీల్ ఆఫ్ మాస్క్ కేవలం బయట నుండి తీసుకుంటున్నాం కావున అధికంగా ఖర్చు ఏమి అవదు.
వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఫేస్ కి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 20 నిమిషాల వరకు దీనిని ఉంచుకోవాలి. ఆరిన తర్వాత ఈ మాస్క్ ను చివర్ల నుండి లాగితే ఫీల్ లాగా వస్తుంది. ఇది అలా రావడం వల్ల ఫేస్ పై ఉండే మురికి, బ్లాకెడ్స్, వైటేడ్స్, జిడ్డు సులభంగా తొలగిపోతాయి. ఫేస్ పై ఉండే టాన్ కూడా తొలగిపోయి కాంతివంతంగా తయారవుతుంది. ఈ ప్యాక్ ను ఎటువంటి శుభకార్యాలకైనా లేదా వారానికి రెండుసార్లు కూడా ఇలా ట్రై చేయవచ్చు. ఈ విధంగా ట్రై చేయడం వలన ముఖం ఎంత నల్లగా ఉన్నా సరే తెల్లగా మారిపోతుంది. ఈ ప్యాక్ ఉపయోగించడం వలన మీ ఫేస్ లో అద్భుతమైన గ్లో కూడా వస్తుంది. ఈ ప్యాకు అద్భుతమైన రిజల్ట్ ని కూడా చూపిస్తుంది.