Redmi Note 14 : అదిరింద‌య్య ఆఫ‌ర్‌.. రూ.26 వేల రెడ్‌మి ఫోన్ కేవ‌లం రూ. 7వేలకే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Redmi Note 14 : అదిరింద‌య్య ఆఫ‌ర్‌.. రూ.26 వేల రెడ్‌మి ఫోన్ కేవ‌లం రూ. 7వేలకే..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లలో అతి తక్కువ ధరలో Redmi Note 14 Pro ఫోన్

  •  Redmi Note 14 : అదిరింద‌య్య ఆఫ‌ర్‌.. రూ.26 వేల రెడ్‌మి ఫోన్ కేవ‌లం రూ. 7వేలకే..!

Redmi Note 14 : ఈ ఏడాది విడుదలైన రెడ్‌మి నోట్ 14 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వేదికలపై భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. 256GB వేరియంట్‌ ధర రూ.25,999గా ఉన్నా, బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లతో ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు పొందవచ్చు. అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు రూ.779 క్యాష్‌బ్యాక్ లభించనుంది. దీంతో దీని ధర దాదాపు రూ.22,200కి పడిపోతుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా యాక్సిస్‌ బ్యాంక్‌ యూజర్లకు 5% క్యాష్‌బ్యాక్ లభించనుంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.7,000కన్నా తక్కువ ధరకు ఈ ఫోన్‌ ను సొంతం చేసుకోవచ్చు

Redmi Note 14 అదిరింద‌య్య ఆఫ‌ర్‌ రూ26 వేల రెడ్‌మి ఫోన్ కేవ‌లం రూ 7వేలకే

Redmi Note 14 : అదిరింద‌య్య ఆఫ‌ర్‌.. రూ.26 వేల రెడ్‌మి ఫోన్ కేవ‌లం రూ. 7వేలకే..!

Redmi Note 14 : రెడ్‌మి నోట్ 14 ప్రో ఫీచర్లను పరిశీలిస్తే..

ఇది 6.67 అంగుళాల FHD+ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌ లెవల్స్‌ దీన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో మేడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 8GB ర్యామ్‌తో పాటు 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. హైపర్ OS 2పై రన్ అయ్యే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారితంగా స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది…

Redmi Note 14 ఫోన్‌ బ్యాటరీ, కెమెరా ఫీచర్లను చూస్తే..

ఇది 5500mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీతో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రోజంతా బ్యాటరీ లైఫ్‌ అందించగలదు. IP69 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్‌తో రఫ్ యూజ్‌కు సైతం సరిపోతుంది. ఫోటో మరియు వీడియో లవర్స్‌ కోసం 50MP ప్రధాన కెమెరా (OISతో), 8MP అల్ట్రా వైడ్‌, 2MP మాక్రో లెన్స్‌లతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. ముందువైపు 32MP సెల్ఫీ కెమెరా ఉంది. బ్లాక్‌, గ్రీన్‌, ఫాంటమ్ పర్పుల్ రంగుల్లో లభించే ఈ ఫోన్, బడ్జెట్ ధరకు ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను కోరుకునే వారికి బెస్ట్ ఎంపికగా నిలుస్తోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది