Electric Vehicles : 9 నిమిషాల ఛార్జ్ చేస్తే ఏకంగా 900కి పైగా కి.మీ.. ఇదే క‌దా కావ‌ల్సింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Electric Vehicles : 9 నిమిషాల ఛార్జ్ చేస్తే ఏకంగా 900కి పైగా కి.మీ.. ఇదే క‌దా కావ‌ల్సింది..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 August 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Electric Vehicles : 9 నిమిషాల ఛార్జ్ చేస్తే ఏకంగా 900కి పైగా కి.మీ.. ఇదే క‌దా కావ‌ల్సింది..!

Electric Vehicles : ప్ర‌స్తుతం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కి డిమాండ్ పెరిగింది. భారతదేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ వాహనాలను ఆదరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణ‌గా ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను అందిస్తున్నాయి. దీంతో ఈవీ వాహనాలు ప్రజలకు తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. అధునాతన సాంకేతికతలను ప్రోత్సహించడానికి అధునాతన బ్యాటరీలతో కూడిన ఈవీ వాహనాలకు మాత్రమే ప్రస్తుతం ప్రోత్సాహకాలను అందిస్తున్నారు . అయితే పెరుగుతున్న ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కి అనుగుణంగా చార్జింగ్ స్టేష‌న్స్ మాత్రం అందుబాటులోకి రావ‌డం లేదు.

Electric Vehicles సామ్‌సంగ్ నుంచి మ‌రో అద్భుతం

అయితే పెట్రోల్ బంకుల‌తో పోల్చితే ఈవీ స్టేష‌న్స్ త‌క్కువ‌గా ఉండ‌డం కాస్త ఇబ్బంది అవుతుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఈవీ స్టేష‌న్స్ ఏర్పాటు పెరుగుతోంది. పెట్రోల్‌తో బైక్‌లు వినియోగించ‌డం కాస్త త‌గ్గ‌డంతో ఈవీ స్టేషన్స్ ఎక్కువ‌గా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈవీ వెహికిల్స్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. అయితే బ్యాట‌రీ చార్జ్ కావ‌డానికి కాస్త స‌మ‌యం ఎక్కువ ప‌డుతుండ‌డం కొంత ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ దిగ్గ‌జం సామ్‌సంగ్ స‌రికొత్త ఆలోచ‌న చేస్తోంది. ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే ఏకంగా 965 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించే ఈవీ బ్యాట‌రీని ఆవిష్క‌రించింది.

Electric Vehicles 9 నిమిషాల ఛార్జ్ చేస్తే ఏకంగా 900కి పైగా కిమీ ఇదే క‌దా కావ‌ల్సింది

Electric Vehicles : 9 నిమిషాల ఛార్జ్ చేస్తే ఏకంగా 900కి పైగా కి.మీ.. ఇదే క‌దా కావ‌ల్సింది..!

కార్లు, బైక్స్‌, ట్ర‌క్స్‌, బ‌స్సు.. ఇలా ఏ వాహ‌నంలో అయినా కూడా సామ్ సంగ్ బ్యాటరీని ఉప‌యోగించుకోవ‌చ్చు. సామ్‌సంగ్‌లోని బ్యాట‌రీ విభాగ‌మైన సామ్‌సంగ్ ఎస్‌డీఐ దీన్ని రూపొందించింది. ఈ బ్యాట‌రీ కేవ‌లం 9 నిమిషాల్లోనే 100 శాతం రీఛార్జ్ కావ‌డం విశేషం. 20 ఏళ్ల పాటు ఈ బ్యాట‌రీకి స‌ర్వీస్ ఇచ్చారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించి ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని, త్వ‌ర‌లోనే వాటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవ‌కాశం ఉంది. 2027 నాటికి ఈ బ్యాట‌రీలు మార్కెట్లోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కంపెనీ చెబుతుంది. ఒక్క‌సారి ఇవి మార్కెట్ లోకి వ‌స్తే ఇక ఈవీ వాహ‌నాల‌కి గిరాకి మ‌రింత పెరుగుతుంద‌ని అంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది