Categories: NewsTechnology

SBI : సామాన్యుల కోసం ఎస్‌బీఐ SBI అదిరిపోయే గుడ్ న్యూస్..!

SBI  : రోజూ కష్టపడి పనిచేసే కూలీలు, చిన్న ఉద్యోగులు తమ నెలవారీ ఆదాయంలోంచి కొంత మొత్తాన్ని పొదుపుగా పెట్టడం చాలా కష్టమైన విషయం. అయితే వారికీ భవిష్యత్తులో ఆర్థిక భద్రతను కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. ఇది చిన్న మొత్తాల్లో నెలనెలా డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు, ఆదాయంపై మంచి వడ్డీ కూడా అందిస్తోంది. ఇది ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ (SBI RD Scheme) పేరుతో అందుబాటులో ఉంది.

SBI : సామాన్యుల కోసం ఎస్‌బీఐ SBI అదిరిపోయే గుడ్ న్యూస్..!

SBI : SBI లో నెలకు రూ.100, 500, 1000 కడితే ఎంతొస్తుందో తెలుసా..?

ఈ స్కీమ్‌లో కనీసంగా 12 నెలల నుంచి గరిష్ఠంగా 120 నెలల (5 సంవత్సరాల) వరకు డిపాజిట్ చేయొచ్చు. నెలకు కనీసం రూ.100 నుండి ప్రారంభించి ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. దేశంలోని అన్ని ఎస్‌బీఐ బ్రాంచుల్లో ఈ పథకం అందుబాటులో ఉంది. ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత, ప్రతి నెలగా నిర్ణీత తేదీలో డిపాజిట్ చేయాలి. ఇవ్వాల్సిన తేదీలో డిపాజిట్ చేయకపోతే పెనాల్టీ విధించబడుతుంది. వరుసగా ఆరు నెలలు డిపాజిట్ చేయకపోతే ఖాతాను మూసివేసి బ్యాలెన్స్ చెల్లించబడుతుంది.

వడ్డీ లెక్కలు చూస్తే.. ప్రస్తుతం ఈ పథకంపై వార్షిక వడ్డీ రేటు 6.50%గా ఉంది. ఉదాహరణకు నెలకు రూ.100 చొప్పున 5 సంవత్సరాలపాటు డిపాజిట్ చేస్తే మొత్తం డిపాజిట్ రూ.6,000 అవుతుంది. దీనిపై రూ.1,106 వడ్డీ కలిపి రూ.7,106 లభిస్తుంది. అదే నెలకు రూ.500 జమ చేస్తే, డిపాజిట్ రూ.30,000 కాగా, వడ్డీ రూ.5,528తో కలిపి రూ.35,528 వస్తాయి. రూ.1000 నెలకు డిపాజిట్ చేస్తే, మొత్తం రూ.60,000 డిపాజిట్, రూ.11,057 వడ్డీతో కలిపి రూ.71,057 లభిస్తుంది. దీనివల్ల తక్కువ ఆదాయంతో ఉన్నవారికి కూడా భవిష్యత్తులో పెద్ద మొత్తంలో పొదుపు వచ్చే అవకాశం ఉంటుంది.

Recent Posts

Bus : ఛీ..ఛీ పబ్లిక్ గా బస్సు లో ఇలాంటి పనులేంటి..? వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం

Bus : ఇప్పటి తరం టీనేజర్లలో ప్రేమ అనేది ఓ ట్రెండ్‌గా మారింది. స్కూల్ దశ నుంచే బాయ్‌ఫ్రెండ్‌, గర్ల్‌ఫ్రెండ్‌…

6 hours ago

Mibot Ev Car : కొత్త సూప‌ర్ కారు.. మిబోట్ పేరుతో మార్కెట్లోకి లాంచ్.. ఒక్కసారి చార్టీ చేస్తే ఎంత వెళ్తుతుందో తెలుసా..?

Mibot Ev Car : జ‌పాన్ కంపెనీ మిబోట్ పేరుతో మార్కెట్లో కొత్త కారుని లాంచ్ చేయ‌బోతుంది. హిరోషిమా సమీపంలోని…

7 hours ago

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం పథకం ముందుగా వారికే రుణాలు.. ఆ తర్వాతే వీరికి

Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఆర్థికంగా తోడ్పాటు కల్పించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

8 hours ago

Chiranjeevi Anil Ravipudi : జెట్ స్పీడ్‌లో చిరు- అనీల్ రావిపూడి ప్రాజెక్ట్.. విశ్వంభర ప‌రిస్థితి ఏంటి ?

Chiranjeevi Anil Ravipudi : చిరంజీవి నయనతార కాంబినేషన్ లో అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్ రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే.…

9 hours ago

Bank Loan : బ్యాంకు లోన్ క్లోజ్ చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.. లేక‌పోతే మీ ప‌ని అంతే..!

Bank Loan : ఇల్లు, విద్య, వాహనం లేదా వ్యక్తిగత అవసరాల కోసం చాలా మంది బ్యాంకుల నుండి రుణాలు…

10 hours ago

Hardik Pandya Vs Shubman Gill : హార్ధిక్, గిల్ మ‌ధ్య కోల్డ్ వార్.. బ‌య‌ట‌ప‌డిన వీడియో..!

Hardik Pandya Vs Shubman Gill : ఐపీఎల్ IPL 2025 అంటేనే ఒక్కొక్క‌రిలో క‌సి అలా త‌న్నుకొచ్చేస్తూ ఉంటుంది.…

11 hours ago

Liver Detox : మీ లివర్ ని న్యాచురల్ పద్ధతిలో ఆరోగ్యంగా ఉంచాలంటే… సద్గురువు చెప్పిన సీక్రెట్స్ డ్రింక్ ఇదే…?

Liver Detox : శరీరంలో ముఖ్యమైన అవయవాలలో గుండె ఎంత ముఖ్యమో అలాగే కాలేయం కూడా అంత ముఖ్యమైన అవయవం.…

12 hours ago

R Narayana Murthy : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టిన నారాయణమూర్తి..!

R Narayana Murthy : పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి థియేటర్ల సమస్యలపై స్పందిస్తూ.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల…

13 hours ago