SBI : సామాన్యుల కోసం ఎస్‌బీఐ SBI అదిరిపోయే గుడ్ న్యూస్..!
ప్రధానాంశాలు:
SBI : సామాన్యుల కోసం ఎస్‌బీఐ SBI అదిరిపోయే గుడ్ న్యూస్..!
SBI : రోజూ కష్టపడి పనిచేసే కూలీలు, చిన్న ఉద్యోగులు తమ నెలవారీ ఆదాయంలోంచి కొంత మొత్తాన్ని పొదుపుగా పెట్టడం చాలా కష్టమైన విషయం. అయితే వారికీ భవిష్యత్తులో ఆర్థిక భద్రతను కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. ఇది చిన్న మొత్తాల్లో నెలనెలా డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు, ఆదాయంపై మంచి వడ్డీ కూడా అందిస్తోంది. ఇది ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ (SBI RD Scheme) పేరుతో అందుబాటులో ఉంది.

SBI : సామాన్యుల కోసం ఎస్‌బీఐ SBI అదిరిపోయే గుడ్ న్యూస్..!
SBI : SBI లో నెలకు రూ.100, 500, 1000 కడితే ఎంతొస్తుందో తెలుసా..?
ఈ స్కీమ్‌లో కనీసంగా 12 నెలల నుంచి గరిష్ఠంగా 120 నెలల (5 సంవత్సరాల) వరకు డిపాజిట్ చేయొచ్చు. నెలకు కనీసం రూ.100 నుండి ప్రారంభించి ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. దేశంలోని అన్ని ఎస్‌బీఐ బ్రాంచుల్లో ఈ పథకం అందుబాటులో ఉంది. ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత, ప్రతి నెలగా నిర్ణీత తేదీలో డిపాజిట్ చేయాలి. ఇవ్వాల్సిన తేదీలో డిపాజిట్ చేయకపోతే పెనాల్టీ విధించబడుతుంది. వరుసగా ఆరు నెలలు డిపాజిట్ చేయకపోతే ఖాతాను మూసివేసి బ్యాలెన్స్ చెల్లించబడుతుంది.
వడ్డీ లెక్కలు చూస్తే.. ప్రస్తుతం ఈ పథకంపై వార్షిక వడ్డీ రేటు 6.50%గా ఉంది. ఉదాహరణకు నెలకు రూ.100 చొప్పున 5 సంవత్సరాలపాటు డిపాజిట్ చేస్తే మొత్తం డిపాజిట్ రూ.6,000 అవుతుంది. దీనిపై రూ.1,106 వడ్డీ కలిపి రూ.7,106 లభిస్తుంది. అదే నెలకు రూ.500 జమ చేస్తే, డిపాజిట్ రూ.30,000 కాగా, వడ్డీ రూ.5,528తో కలిపి రూ.35,528 వస్తాయి. రూ.1000 నెలకు డిపాజిట్ చేస్తే, మొత్తం రూ.60,000 డిపాజిట్, రూ.11,057 వడ్డీతో కలిపి రూ.71,057 లభిస్తుంది. దీనివల్ల తక్కువ ఆదాయంతో ఉన్నవారికి కూడా భవిష్యత్తులో పెద్ద మొత్తంలో పొదుపు వచ్చే అవకాశం ఉంటుంది.