Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి గుడ్ న్యూస్… ఈ 6 లాభాలను పొందండి…
Electric Vehicles : ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల వలన ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి కొన్ని లాభాలు ఉన్నాయి 2019 బడ్జెట్లో ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను మినహాయింపు ఇవ్వడం గురించి ప్రకటన చేసింది. ఈ ప్రయోజనం కేంద్రస్థాయిలోనే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ సొంత నిబంధనను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆదాయపు పన్ను సెక్షన్ 80EEB కింద రుణం వడ్డీ పై పన్ను మినహాయింపు లభిస్తుంది.
1) కారు లోన్ తీసుకొని ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేస్తే దాని వడ్డీ పై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ ప్రయోజనం సెక్షన్ 80EEB కింద ఇవ్వబడింది రుణాన్ని బ్యాంకు లేదా ఎన్ బిఎఫ్ సి నుండి మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. 2) ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టి మినహాయింపును అందిస్తుంది గతంలో 12 శాతం ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించింది. 3) ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ లో మనకు తెలియని అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి దీని నష్టం కూడా సాధారణ వాహనాల కంటే వేగంగా భర్తీ చేయబడుతుంది. మోటార్ వాహన చట్ట ప్రకారం కనీసం థర్డ్ పార్టీ కవర్ తీసుకోవడం తప్పనిసరి. ఇది వాహనానికి ప్రమాదవశాత్తు కవర్ నష్టాన్ని కూడా అందిస్తుంది.
4) డీజిల్ లేదా పెట్రోల్ కార్ తో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనం నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటాయి. సాధారణ వాహనాలతో పోలిస్తే దీని విడిభాగాలు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. 5) ఎలక్ట్రిక్ వాహనాలపై గ్రీన్ టాక్స్ లేదు గ్రీన్ టాక్స్ అంటే ప్రతి 15 ఏళ్లకు ఒకసారి వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాలి అందుకు కొంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు అలాంటి పన్ను లేదు. 6) ఎలక్ట్రిక్ కారును కొంటే కాలుష్య నియంత్రణ ప్రమాణ పత్రాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రిక్ కారు బ్యాటరీతో నడుస్తుంది అందుకే ఇది ఎటువంటి కాలుష్యాన్ని కలిగించదు. పియుసి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
సెక్షన్ 80EEB లో మినహాయింపు షరతులు: ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు కోసం మాత్రమే లోన్ తీసుకోవాలి. లోన్ ఆర్థిక సంస్థ బ్యాంకు లేదా ఎన్ బిఎఫ్ సి నుండి తీసుకోవాలి పన్ను మినహాయింపు ప్రయోజనం రుణంపై వడ్డీ పై మాత్రమే ఇవ్వబడుతుంది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 80EEB కింద పన్ను మినహాయింపును పొందుతారు. మినహాయింపు క్లైమ్ మొత్తం 1.5లక్షలకు మించకూడదు.