Home » News » Special Tab Release For Children From Lenovo Adipina Features
News

Lenovo Tab : లెనోవో నుంచి పిల్లల కోసం స్పెషల్ ట్యాబ్ రిలీజ్.. అదిరిపోయిన ఫీచర్స్

Authored By
mallesh
The Telugu News | Published on: October 1, 2022, 9:00 pm
Advertisement

Lenovo Tab :ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవో కస్టమర్లకు శుభవార్త చెప్పింది. అదిరిపోయే ఫీచర్లతో కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చినట్టు తెలిపింది.10.61 అంగులాలతో వస్తున్న ఈ ట్యాబ్‌లో 2K ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. లెనోవో ట్యాబ్ ఎం10 ప్లస్ 3వ జనరేషన్‌తో వస్తున్న ఈ ట్యాబ్ టీయూవీ రీన్‌ల్యాండ్‌లో బ్లూలైట్ ధృవపత్రాన్ని కలిగి ఉంది.లెనోవో ట్యాబ్ ఎం10 ప్లస్ 3 జనరేషన్‌తో వచ్చిన సరికొత్త వేరియంట్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

ఇందులో స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ ఉంది. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుండగా..మైక్రో ఎస్‌డీ కార్డ్ కోసం స్లాట్‌ను కూడా లెనోవో అందుబాటులోకి తెచ్చింది.దీనికి తోడు ఈ ట్యాబ్ వెనుక 8 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు.సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు.ఈ ట్యాబ్ డాల్బీ అట్మోస్‌ టెక్నాలజీకి సపోర్ట్ చేసే నాలుగు స్పీకర్లను ఇచ్చారు. 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా అందిస్తున్నారు.

special tab release for children from lenovo adipina features

Advertisement

Lenovo Tab :స్పెపిఫికేషన్స్ వండర్ ఫుల్..

పిల్లల కోసం ప్రత్యేకమైన కంటెంట్ ఫిల్టర్స్, ప్రైవసీ సపోర్ట్ ఉండే గూగుల్ కిడ్స్ స్పేస్‌‌ను అందిస్తున్నారు.లెనోవో ట్యాబ్ ఎం10 ప్లస్ 3rd జనరేషన్ ట్యాబ్ వైఫై ఓన్లీ మోడల్ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. వైఫై +ఎల్టీఈ వేరియంట్ రూ.21,999 ధరకు అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్స్ అయిన అమెజాన్, లెనోవో వెబ్‌సైట్‌ lenovo.comలో ఈ ట్యాబ్‌ను కొనుగోలు చేయవచ్చును.ఇది కిడ్స్ ప్లే స్టేషన్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. బ్రౌజింగ్ పర్సస్ కోసం కూడా వాడుకోవచ్చు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి