Varivo Motors : రూ.45 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఏకంగా ఆరు మోడల్స్ కూడా..
Varivo Motors : ఈ మధ్య చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో వారివో మోటార్స్ అనే ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్, కేవలం రూ.44,999 ప్రారంభ ధరతో ఆరు కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొని వచ్చింది. ఈ స్కూటర్లు మార్కెట్‌లో అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తాయి. వారివో ఇప్పటికే సీఆర్‌ఎక్స్ (CRX), జెడ్‌బి (ZB), ఎల్-1 ప్లస్ (L-1 Plus), ఎల్-2 (L-2), నెక్సా డీఎస్ (Nexxa DS) వంటి వివిధ ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణులను విక్రయిస్తోంది.
Varivo Motors : రూ.45 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఏకంగా ఆరు మోడల్స్ కూడా..
ఎడ్జ్ సిరీస్’ మాత్రం రోజువారీ ఉపయోగం కోసం, తక్కువ ధరలో ప్రయాణాన్ని అందించేలా తయారు చేశారు. ఎడ్జ్ ధర రూ.44,999 (ఎక్స్-షోరూమ్). దీనికి 195 mm గ్రౌండ్ క్లియరెన్స్, 800 mm సీట్ ఎత్తు ఉంటుంది. ఎడ్జ్+ ధర రూ.49,999 (ఎక్స్-షోరూమ్). దీనికి 175 mm గ్రౌండ్ క్లియరెన్స్, 760 mm సీట్ ఎత్తు ఉంటుంది.స నోవా సిరీస్: వారివో మోటార్స్ టాప్-ఆఫ్-లైన్ సిరీస్ ఇది. నోవా సిరీస్‌లో నోవా, నోవా-ఎక్స్, నోవా-ఎస్ (Nova-S) అనే మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ మూడు స్కూటర్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తాయి. వీటికి కూడా 3 సంవత్సరాల వారంటీని ఇస్తారు. ఎంట్రీ లెవెల్ నోవా ధర రూ.55,999 (ఎక్స్-షోరూమ్), నోవా-ఎక్స్ ధర రూ.59,999 (ఎక్స్-షోరూమ్), నోవా-ఎస్ ధర రూ.64,999 (ఎక్స్-షోరూమ్). నోవాలో 810 mm సీట్ ఎత్తు, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. నోవా ఎక్స్‌లో 140 mm గ్రౌండ్ క్లియరెన్స్, 775 mm సీట్ ఎత్తు ఉంది. నోవా ఎస్లో 170 mm గ్రౌండ్ క్లియరెన్స్, 780 mm సీట్ ఎత్తు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారతదేశం అంతటా 200 కొత్త స్టోర్లను తెరవాలని ప్లాన్ చేసింది
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
This website uses cookies.