Voter ID Aadhar : ఓటరు ఐడీని ఆధార్‌తో లింక్ చేయకపోతే ఎలా.. ఓటు వేయలేమా ?
ప్రధానాంశాలు:
Voter ID Aadhar : ఓటరు ఐడీని ఆధార్‌తో లింక్ చేయకపోతే ఎలా.. ఓటు వేయలేమా ?
Voter ID Aadhar : ఓటరు ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానించే ప్రణాళికలను ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే . అయితే “ఓటరు ఐడీని ఆధార్‌తో లింక్ చేయకపోతే ఓటు వేయలేమా?” అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో తలెత్తుతోంది. అయితే ఓటరు ఐడీతో ఆధార్ కార్డును లింక్ చేసే ప్రక్రియ ఓటరు ఇష్టాన్ని బట్టి చేసుకునేందుకు అనుమతిచ్చింది. కాకపోతే కారణం మాత్రం చూపించాల్సిందనేట.

Voter ID Aadhar : ఓటరు ఐడీని ఆధార్‌తో లింక్ చేయకపోతే ఎలా.. ఓటు వేయలేమా ?
Voter ID Aadhar ఏది నిజం..
ఆధార్ సమర్పించడానికి నిరాకరించే ఓటర్లు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు(ఈఆర్‌ఓ)ల ముందు హాజరు కావాల్సి ఉంటుందా అని అడిగినప్పుడు.. అవన్నీ ఊహాగానాలుమాత్రమేనని చెప్పారు. ఆధార్, ఎన్నికల పారదర్శకత సంబంధిత అంశాలపై పనిచేసిన కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ డైరెక్టర్ వెంకటేష్ నాయక్, యూఐడీఏఐ ఆధార్‌ను రద్దు చేస్తే ఓటరును ఓటర్ల జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇది ప్రతి ఓటరు ఎదుర్కొనే ఇబ్బంది అన్నారు. దీనిని పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపారు.ఆధార్-ఓటర్ లింక్ అనేది పూర్తిగా స్వచ్ఛందమని, తెలిపారు.. సుప్రీంకోర్టు 2023 తీర్పుకు అనుగుణంగా లింక్ చేయడం జరుగుతుందని ఈసీఐ తెలిపింది. అయితే ఒకవేళ లింక్ చేయడానికి నిరాకరిస్తే అందుకో ప్రత్యేకంగా ఓ ఫారం ఇవ్వాల్సి వస్తే అది ‘షో కాజ్’ మాదిరిగా మారిపోయే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు.