WhatsApp : వాట్సాప్ కొత్త ఫీచర్ .. గ్రూప్ లో ఇది తప్పనిసరి ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

WhatsApp : వాట్సాప్ కొత్త ఫీచర్ .. గ్రూప్ లో ఇది తప్పనిసరి ..!!

WhatsApp : ప్రస్తుతం ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. అందుకే వాట్సాప్ సంస్థ తమ వినియోగదారులను ఆకర్షించేలా కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్ టాప్ తో సహా దాని అన్ని వర్షన్ లలో కస్టమర్స్ ఇంటర్ఫేస్ గోప్యతను మెరుగుపరచడానికి వాట్సాప్ కొత్త అప్డేట్స్ తీసుకువస్తుందని నివేదికలు వెల్లడించాయి. రాబోయే అప్డేట్స్ లో కీబోర్డ్ కోసం కొత్త ఎమోజీలు, గ్రూప్ చాట్ అడ్మిన్ ల కోసం కొత్త ఆమోదం ఫీచర్లు ఉంటాయని తెలుస్తుంది. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :15 March 2023,11:40 am

WhatsApp : ప్రస్తుతం ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. అందుకే వాట్సాప్ సంస్థ తమ వినియోగదారులను ఆకర్షించేలా కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్ టాప్ తో సహా దాని అన్ని వర్షన్ లలో కస్టమర్స్ ఇంటర్ఫేస్ గోప్యతను మెరుగుపరచడానికి వాట్సాప్ కొత్త అప్డేట్స్ తీసుకువస్తుందని నివేదికలు వెల్లడించాయి. రాబోయే అప్డేట్స్ లో కీబోర్డ్ కోసం కొత్త ఎమోజీలు, గ్రూప్ చాట్ అడ్మిన్ ల కోసం కొత్త ఆమోదం ఫీచర్లు ఉంటాయని తెలుస్తుంది. ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్ లకు మరింత నియంత్రణను ఇస్తుంది.

WhatsApp introduce new feature for WhatsApp group

WhatsApp introduce new feature for WhatsApp group

వాట్సాప్ తన ఆండ్రాయిడ్ బీటా వినియోగదారుల కోసం 21 కొత్త ఎమోజీలు పరీక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే అప్డేట్స్ లో ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా వాట్సాప్ కొత్త ఎమోజీలు తాజా అప్డేట్ లో భాగంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇంతకుముందు కొత్త ఎమోజీలు ఉన్న అధికారికంగా అదుబాటులో లేవు. అయితే ఇప్పుడు వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త ఎమోజీలను పరీక్షించి విడుదల చేస్తుంది. అలాగే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కోసం ప్రత్యేక ఫీచర్ ను ప్రవేశపెట్టింది.

Is WhatsApp Safe? WhatsApp Security Issues 2022 | Reader's Digest

గ్రూప్ ఇన్వైట్ లింక్ ద్వారా గ్రూప్ లో చేరగలిగే వ్యక్తుల సంఖ్యను నియంత్రించే అవకాశం తాజా అప్డేట్స్ తో గ్రూప్ అడ్మిన్ లకు లభించనుంది. సెట్టింగ్స్ నుంచి ప్రారంభించిన తర్వాత వాట్సాప్ యూజర్స్ గ్రూప్ చాట్ లో కొత్త వ్యక్తి గ్రూప్ లో చేరడానికి అడ్మిన్ నుంచి అనుమతి తీసుకునేలా సందేశం వస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. యూజర్స్ గ్రూప్ సెట్టింగ్లలో కొత్త గ్రూప్ సెట్టింగ్లను కనుగొంటారు. ఇక్కడ కొత్త పార్టిసిపెంట్లను ఆమోదించండి అని ఎంపిక కనబడుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది