WhatsApp : వాట్సాప్ కొత్త ఫీచర్ అదిరింది .. ఇకపై అలాంటివి కుదరవు ..!
WhatsApp : ప్రస్తుతం ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ తప్పనిసరి. వాట్సాప్ లేని ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదు. వాట్సాప్ అంతలా మనిషి జీవితంలో భాగమైపోయింది. ఇక వాట్సాప్ కూడా వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ఫీచర్ ఏంటంటే ఇకనుంచి ఎవరైనా మెసేజ్ పంపితే ఒక్కసారి మాత్రమే ఆ మెసేజ్ చూసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ మెసేజ్ కనిపించకుండా పోతుంది.
మెసేజ్ పంపిన వారికి, అందుకున్న వారికి ఆటోమేటిగ్గా ఆ మెసేజ్ డిలీట్ అయిపోతుంది. ఆ ఫీచర్ పేరే వ్యూ వన్స్ మెసేజ్ ఫీచర్. ఇక నుంచి ఎవరైనా మనకు మెసేజ్ చేస్తే ఫార్వర్డ్ చేయడం కుదరదు. ఈ ఫీచర్ రాకముందు వాట్సాప్ అకౌంట్స్ లో సభ్యులు చేసే చాట్ కొద్ది టైం తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేలా డిసపియరింగ్ అనే ఫీచర్ వచ్చింది. ఇప్పటికే వాట్సాప్లో వ్యూ వన్స్ ఫీచర్ ఫొటోస్, వీడియోలు వాడకంలో ఉంది. ఫోటోలు లేదా వీడియోలకు వ్యూ వన్స్ ఫీచర్ ను ఎంచుకుంటే ఒక్కసారి మాత్రమే కనిపించి తర్వాత కనిపించకుండా పోతాయి.
దీనిని స్క్రీన్ షాట్ తీయడం కుదరదు. వాట్సాప్ ఇదే ఫీచర్ను టెక్స్ట్ మెసేజ్ కు వచ్చేలా చేయాలని ఆలోచిస్తుంది. టెక్స్ట్ ఫార్మాట్ కోసం వ్యూ వన్స్ ఫీచర్ అమలుపరచడానికి ప్రత్యేకంగా ఒక సెండ్ బటన్ వచ్చే అవకాశం ఉందనీ తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా యూసర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్ త్వరలోనే పూర్తిస్థాయిలో వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానంది. ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.