WhatsApp : వాట్సాప్ కొత్త ఫీచర్ అదుర్స్ .. ఇకపై వాటికి ఛాన్స్ లేదు ..!
WhatsApp : ప్రస్తుతం కాలంలో వాట్సాప్ లేని ఫోన్ లేదు. ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ తప్పనిసరి. ఇద్దరి వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్స్ ఎక్కువగా ఈ వాట్సాప్ ద్వారానే జరుగుతున్నాయి. అలాగే వాట్సాప్ లో ఈరోజు ఏం చేశారు అందరికీ తెలిసేలా వాట్సప్ స్టేటస్ లో పెడుతున్నారు. దీంతో ఇక ఆ వ్యక్తికి ఫోన్ చేయాల్సిన పని కూడా లేదు. అతను ఏం చేస్తున్నాడు ఆ వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలిసిపోతుంది. ఇక వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు తన యూజర్లను ఆకట్టుకునేలా కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ లో
మొదటి స్థానంలో వాట్సాప్ ఉండడానికి కారణం ఈ ఫీచర్లే. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. ‘ డోంట్ డిస్టర్బ్ ‘ అనే ఫీచర్ ను యూజర్ లకి అందుబాటులోకి తీసుకొచ్చింది. కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ బీటా వర్షన్ లకు అందుబాటులోకి వచ్చింది. టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే కేవలం వెబ్ వెర్షన్ ఉపయోగిస్తున్న వారికి మాత్రమే ఈ ‘ డోంట్ డిస్ట్రబ్ ‘ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వెబ్ వెర్షన్ ను ఉపయోగిస్తున్న
సమయంలో ఇన్ కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు వాటి నోటిఫికేషన్లను స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. యూజర్లు ఈ ఫీచర్ కోసం సెట్టింగ్ ఆప్షన్స్ లోకి వెళ్లి ఇన్ కమింగ్ వాట్సాప్ కాల్ స్విచ్ ఆఫ్, ఆన్ చేసుకోవచ్చు. ఇకపోతే వాట్సాప్ గత కొన్ని రోజులుగా కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఇటీవల వాట్సాప్ కాంటాక్ట్ కార్డులను షేర్ చేసే ఫీచర్ ను తీసుకొచ్చింది. అలాగే ‘ అవతార్ ‘ అనే కొత్త ఫీచర్ ని కూడా తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను డిజిటల్ వర్షన్ గా రూపొందించుకోవచ్చు. ఫోటోలకు హెయిర్ స్టైల్, ఫేషియల్, డ్రెస్సింగ్ స్టైల్ లను మార్చుకోవచ్చు.