WhatsApp : నిలిచిపోయిన వాట్సాప్ సేవలు.. టెన్షన్ పడుతున్న వినియోగదారులు
WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఒక్కసారిగా ఆగిపోయింది. వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. భారత్‌లో సుమారు మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమస్య మొదలు కాగా, వేలాది మంది యూజర్లు ఈ విషయంపై ఫిర్యాదులు చేయడంతో అసలు విషయం వెలుగులుఓకి వచ్చింది.. వాట్సాప్‌లో మెసేజ్‌లు రావడం, పోవడం పూర్తిగా ఆగిపోవడంతో అందరు ఆందోళన చెందారు.
మధ్యాహ్నం 12.07 గంటల నుంచి సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. పర్సనల్ మెసేజ్ లకు సింగిల్ టిక్ మాత్రమే వస్తుండగా.. స్టేటస్ లు కూడా అప్ డేట్ కావడం లేదు. ఏం జరుగుతుందో తెలియక యూజర్లు ఆయోమయానికి గురమ్యారు. అయితే ఈ విషయంపై వాట్సాప్ ఇంకా స్పందించలేదు. సర్వర్లలో లోపం కారణంగానే వాట్సాప్‌లో సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది.
భారత్తో పాటు ఇటలీ, టర్కీలోనూ వాట్సప్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. వాట్సప్ అంతరాయానికి సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు స్పందించలేదు. వాట్సప్ సేవలు నిలిచిపోవడంతో సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. వేలాది మంది వినియోగదారులకు వాట్సాప్ పని చేయడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
స్పందించిన వాట్సాప్
ఈ ఇష్యూపై వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటా స్పందించింది. కొందరు యూజర్లు మెస్సేజీలు పంపలేకపోతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని వివరించింది. వీలైనంత త్వరగా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తామని తెలిపింది. అయితే వాట్సాప్ డౌన్ కావడం వలన, పలువురు ఇతర సోషల్ మీడియా వేదికలను ఆశ్రయిస్తున్నారు.