XChat : ఎలాన్ మస్క్ పెద్ద ప్లానే.. ఫోన్ నంబర్ లేకుండానే కాల్స్ చేయగల ఫీచర్ రాబోతుంది..!
XChat : సంచలన ప్రకటనలు , సంచలన ప్రయోగాలు చేస్తూ వార్తల్లో నిలిచే ఎలాన్ మస్క్ Elon Musk ..తాజాగా ఆయన ప్రారంభించిన కొత్త మెసేజింగ్ ఫీచర్ “ఎక్స్ చాట్ (XChat)” కూడా అదే రీతిలో సంచలనంగా మారింది. ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌లకు ప్రత్యామ్నాయంగా, ఎక్స్ యాప్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఎక్స్ చాట్ ఫీచర్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో చర్చనీయాంశమవుతోంది. ఇది ఇన్-యాప్ డైరెక్ట్ మెసేజింగ్ వ్యవస్థను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చేయబడింది.
XChat : ఎలాన్ మస్క్ పెద్ద ప్లానే.. ఫోన్ నంబర్ లేకుండానే కాల్స్ చేయగల ఫీచర్ రాబోతుంది..!
ఎక్స్ చాట్ ఫీచర్‌లో ఎన్నో ఆధునిక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సాంకేతికతను అందించి, వినియోగదారుల సందేశాలను అత్యంత రహస్యంగా ఉంచే విధంగా రూపొందించారు. దీంతోపాటు, డిసప్పియరింగ్ మెసేజెస్, వాయిస్, వీడియో కాల్స్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఫోన్ నంబర్ అవసరం లేకుండానే కాల్స్ చేయగలగడం ఈ ఫీచర్‌కు ప్రత్యేక ఆకర్షణ. ఫైల్ షేరింగ్‌కు కూడా పూర్తి స్వేచ్ఛ ఇస్తోంది. ఈ ఫీచర్ల కారణంగా ఎక్స్ చాట్ మెసేజింగ్ మార్కెట్‌లోని ప్రముఖ యాప్‌లకు గట్టి పోటీగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టింగ్ దశలో ఉంది. ప్రారంభంలో ఇది కేవలం ఎక్స్ యాప్ యొక్క సబ్‌స్క్రిప్షన్ వినియోగదారులకే అందుబాటులోకి రానుంది. ఉచిత యూజర్లకు ఇది ఎలాంటి పరిమితులతో లభిస్తుందో అనేది ఇంకా స్పష్టత లేదు. ఎక్స్ చాట్ ద్వారా ఎలాన్ మస్క్ తన ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ను సాధారణ మైక్రోబ్లాగింగ్ యాప్‌గానే కాకుండా, మల్టీ ఫంక్షనల్ కమ్యూనికేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది.
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’…
Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్…
Airport | శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం ఒక ఇండిగో విమానానికి Indigo పెను ప్రమాదం తప్పింది.…
Heart |ఈ రోజుల్లో గుండె జబ్బులు చాలా త్వరగా, చిన్న వయస్సులోనే వస్తున్నాయి. ఊహించని రీతిలో హార్ట్‌అటాక్స్, స్ట్రోక్స్ వంటి…
Guava vs orange | విటమిన్ C అనేది శరీర ఆరోగ్యానికి అత్యవసరమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని బలపరచడమే…
This website uses cookies.