Hyderabad Air Quality : ప్రమాదం అంచున హైదరాబాద్.. వణికిస్తున్న వాయు కాలుష్యం
ప్రధానాంశాలు:
Hyderabad Air Quality : ప్రమాదం అంచున హైదరాబాద్.. వణికిస్తున్న వాయు కాలుష్యం
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా క్రమేపి వాయి కాలుష్యం పెరుగుతూ పోతుంది. వాయి కాలుష్యంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అయినప్పటికీ అక్కడ గాలి కాలుష్యం తగ్గడం లేదు. అయితే ఎయిర్ పొల్యూషన్ ఒక్క ఢిల్లీలోనే కాదు దేశంలోని చాలా ప్రాంతాల్లో గాలి కాలుష్యం పెరుగుతోంది. కోల్ కత్తా, ముంబై, బెంగళురు, చెన్నై, హైదరాబాద్ లో ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఒక్కసారిగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగిపోయింది.
Hyderabad Air Quality పెరుగుతున్న వాయి కాలుష్యం..
కూకట్‌పల్లి, మూసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నం వంటి ప్రాంతాల్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటింది, ఇది దేశ రాజధాని ఢిల్లీతో సమానమైన గాలి కాలుష్య స్థాయిని సూచిస్తోంది. ఈ పరిణామాలు పర్యావరణవేత్తల్ని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. పరిస్థితి మరింత దిగజారకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. నగరంలో చిన్నారులు, వృద్ధులు, అలాగే శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రజల ఆరోగ్యంపై ఈ పరిస్థితులు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో గాలిలో నాణ్యత ప్రమాణాలు పడిపోతుండటం, పెరుగుతున్న కాలుష్యం కారణంగా భవిష్యత్‌లో ఢిల్లీ తరహా పరిస్థితులు హైదరాబాద్‌లో ఏర్పడే ప్రమాదముంటుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 దాటితే ఆరోగ్యానికి హాని అని.. వాయు నాణ్యత తగ్గితే చిన్నారులు, వయోవృద్ధులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.అయితే.. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల వాదన వేరేలా ఉంది. ఈ గణాంకాల్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్న వాదనను వినిపిస్తున్నారు. అయితే.. ఆరోగ్యానికి హాని చేసే పీఎం2.5 స్థాయిలో ఈ నెలలో ఇప్పటివరకు 8 సార్లు 300 ఇండెక్స్ ను దాటిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. గాలిలో నాణ్యత తగ్గితే.. టూవీలర్ మీద ప్రయాణించే వారి ఊపిరితిత్తుల మీద ప్రభావం ఎక్కువగా పడుతుందని చెబుతున్నారు.