
Barrelakka : పెళ్లి అయిన వారానికే బర్రెలక్క ఎమోషనల్ పోస్ట్.. అయ్యో పాపం..!
Barrelakka : హాయ్ ఫ్రెండ్స్.. బర్లకాడికొచ్చిన ఫ్రెండ్స్.. ఎంత చదువుకున్నా నోటిఫికేషన్లు వేస్తలేరు. ఏం వేస్తలేరు.. అందుకే నాలుగు బర్లను కొనుక్కుని కాసుకుంటున్నా.. రోజూ ఐదొందలు సంపాదిస్తున్నా.. అంటూ అప్పట్లో బర్రెలక్క అలియాస్ శిరీష్ చేసిన వీడియో సోషల్ మీడియాను ఊపేసింది. దానిపై అప్పట్లో రాజకీయంగా పెద్ద రచ్చనే జరిగింది. నిరుద్యోగుల సమస్యలు ఇంత ఘోరంగా ఉన్నాయంటూ ఆ వీడియోను ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున వైరల్ చేశాయి. దాంతో ఒక్కసారిగా ఆమెకు ఫేమ్ వచ్చేసింది. ఆ తర్వాత ఆమె బర్రెలు కాసుకుంటూ చేసిన రీల్స్ వీడియోలకు చాలా ఫాలోయింగ్ వచ్చింది.అంతా ఆమెను బర్రెలక్క అంటూ పిలుచుకున్నారు. దాంతో ఆమె అసలు పేరుకంటే బర్రెలక్క పేరుతోనే బాగా పాపులర్ అయింది. ఇక ఆమెను రెండు తెలుగు రాష్ట్రాలలో స్టార్ నుచేసింది మాత్రం తెలంగాణ ఎమ్మెల్యే ఎన్నికలు. ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసింది.
దెబ్బకు ఆమె చుట్టే మీడియా మొత్తం వాలిపోయింది. అటు ఎన్నారైలు కూడా భారీగా ఆమెకు నిధులు విరాళంగా ఇచ్చారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపించింది. దాంతో ఆమెకు స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది.కానీ ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయింది. ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఆమె..రీసెంట్ గానే తమ బంధువుల అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లి వీడియోలు కూడా సోషల్ మీడియాలో భారీగానే వైరల్ అయ్యాయి. ఇక పెళ్లి అయిన తర్వాత ఆమె వారం రోజులు కాకుండానే ఇప్పుడు ఓ ఎమోషనల్ పోస్టు పెట్టింది.
Barrelakka : పెళ్లి అయిన వారానికే బర్రెలక్క ఎమోషనల్ పోస్ట్.. అయ్యో పాపం..!
అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. ఇందులో ఏముందంటే.. ‘ ఒక అమ్మాయికి గాయం అయితే.. గాయం చేసిన వాళ్లను ఏమీ అనరు.. అదే గాయపడ్డ వారిని మాత్రం మాటలతో చంపుతారు. అమ్మాయి ధైర్యంగా బయట నడవడానికి ఉండదు.. మంచోళ్లు ఉన్నారు, చెడ్డోళ్లు ఉన్నారు. ప్రతి అమ్మాయిలో తన అమ్మని చూస్తే తప్పు చేయాలనే ఆలోచన రాదు. ఒక అమ్మాయి దాక్కునే పరిస్థితి రాదు. తప్పు చేసిన వాళ్లు బయట బాగానే ఉన్నారు.. ఏ తప్పు చేయని అమ్మాయిలు బాధపడుతున్నారు’ అంటూ రాసుకొచ్చింది.మరి పెళ్లి అయిన వారం రోజులకే ఇలాంటి పోస్టు పెట్టింది అంటే అత్తారింట్లో ఏదైనా సమస్య వచ్చిందేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనిపై పూర్తి వివరణ రావాల్సి ఉంది.
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.