
Ramadan : రంజాన్ స్పెషల్ ఇఫ్తార్ గంజి...ఎలా తయారు చేస్తారంటే...!
Ramadan : ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు నెలరోజుల పాటు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్…ఇక ఈ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులందరూ నెల రోజులపాటు రోజా ఉంటారు. ఈ పండుగలో రోజా అనేది ప్రధానమైనది. రోజా అంటే ఉపవాసం అని అర్థం. ఇక ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా తప్పకుండా రోజా పాటిస్తూ , వారి దేవుని ఆరాధిస్తూ ,ఖురాన్ చదవడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక ఈ పండుగ సమయంలో ఎక్కువ శాతం ముస్లింలు అందరూ కూడా మసీదులోనే గడుపుతూ కనిపిస్తారు. అలాగే ఈ పండుగ సందర్భంలో ముస్లిం మత పెద్దలు కూడా మసీదుల్లోనే ప్రార్థనలు చేయాల్సిందిగా అందరికీ చెబుతుంటారు. అయితే ఈ రంజాన్ మాసంలో అత్యంత ముఖ్యమైనది ఉపవాసం అని చెప్పాలి. ఇక ఈ ఉపవాసం ముగిసిన తర్వాత వారంతా కలిసి మసీదుల్లో ప్రార్థన ముగించిన తర్వాత ప్రత్యేకించి గంజినే ఆహారంగా తీసుకుంటారు.
రంజాన్ నెలలో మాత్రమే తయారు చేసే ఈ గంజికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాక చాలా ప్రాంతాలలో ఇఫ్తార్ సమయంలో పండ్లు అల్పాహారం లేకపోయినా సరే గిన్నె గంజి అయినా తప్పక తాగాలని సూచిస్తుంటారు. అయితే ఈ గంజిని చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు తీసుకుని తాగుతారు. మరి రంజాన్ మాసంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ గంజిని అసలు ఎలా తయారు చేస్తారు… దానిని తాగడం వలన కలిగే లాభాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం…. రంజాన్ మాసంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ గంజిని బియ్యం రవ్వ లేదా బొంబాయి రవ్వతో తయారు చేస్తారు. అలాగే దీనిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి , అల్లం వెల్లుల్లి ,యాలకులు , లవంగాలు దాల్చిన చెక్క , నెయ్యి వంటి పదార్థాలను కూడా ఉపయోగిస్తారు.. అయితే ఈ గంజి తయారీకి ముందుగా మసాలా దినుసులు అన్నిటిని నెయ్యిలో వేయిస్తారు. అనంతరం ఒక పెద్ద వంట పాత్ర లో నీళ్ళు పోసి బాగా మరగనిస్తారు. నీరు బాగా మరిగిన తర్వాత దీనిలో రవ్వను కలుపుతూ ముందే వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ,సరిపడా ఉప్పు వేసి గంజి చిక్కబడేలా ఉడకనిస్తారు.
Ramadan : రంజాన్ స్పెషల్ ఇఫ్తార్ గంజి…ఎలా తయారు చేస్తారంటే…!
ఈ విధంగా తయారుచేసిన గంజిని అందరికీ పంపిణీీ చేస్తారు. ఇక ఈ గంజిలో కొందరు బూందీ వేసుకుని తినడానికి చాలా ఇష్టపడతారు. మరి కొన్ని చోట్ల ఈ గంజి తయారీకి కొంతమంది ముస్లింలు ఖీమా కూడా వినియోగిస్తారు. అయితే ఉపవాస దీక్షపరుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ గంజిని మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇష్టపడతారని చెప్పాలి. ఇక రంజాన్ నెలలో సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్ అని పిలవబడే ప్రార్ధనలో పలు రకాల ఆహార పదార్థాలతో వారి యొక్క ఉపవాసాన్ని విరమిస్తారు. వాటిలో ముందుగా ఖర్జూరం నీరు లేదా పాలతో వారి ఉపవాస దీక్షను విరమిస్తారు. ఖర్జూరం లేదా నీరు తీసుకున్న తర్వాతే వారి భోజనాన్ని స్వీకరిస్తారు. ఈ రంజాన్ మాసం అంతా ఉపవాసం దీక్ష చేసిన తర్వాత చివరి రోజున. ఈద్-ఉల్-ఫితర్ పండుగను రంజాన్ పండుగగా జరుపుకుంటారు.
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.