Nirmal : వైద్యుల నిర్లక్ష్యంతో అంగన్వాడీ టీచర్ మృతి !
ప్రధానాంశాలు:
Nirmal : వైద్యుల నిర్లక్ష్యంతో అంగన్వాడీ టీచర్ మృతి !
Nirmal : వైద్యుల నిర్లక్ష్యంతో అంగన్వాడీ టీచర్ Anganwadi teacher మృతిచెందినట్లుగా సమాచారం. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రాంటేక్ గ్రామానికి చెందిన సుజాత (37) అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తుంది. ఆమె కిడ్నీ సంబంధ వ్యాధీతో బాధపడుతుంది.
భైంసా ఏరియా ఆసుపత్రిలో వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించుకుంటుంది. ఎప్పటిలాగే సోమవారం డయాలసిస్ కోసం వెళ్లింది. అయితే ఆస్పత్రి సిబ్బంది షిఫ్ట్ చేంజ్ అయ్యిందని రేపు డయాలసిస్ చేస్తామని చెప్పి తిప్పి పంపించారు.
కాగా సమయానికి డయాలసిస్ చేయకపోవడంతో సుజాత నిన్న అర్థరాత్రి మృతి చెందింది. డయాలసిస్ చేసుంటే సుజాత Sujatha బ్రతికేదని, వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
Advertisement
WhatsApp Group
Join Now