
Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ వివాదానికి దారితీస్తోంది. సాక్షి టీవీలో జరిగిన ఓ డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు “అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో వేశ్యల సంఖ్య ఎక్కువగా ఉంది” అన్న ఆరోపణలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ తరఫు నుంచి మహిళా సంఘాలు, అమరావతి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హైదరాబాదులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు చేయడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది…
Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తూ.. చంద్రబాబు నాయకత్వంలో ఈ ఆందోళనలు కృత్రిమంగా, ఆర్గనైజ్డ్‌గా చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి కృష్ణంరాజు క్షమాపణ చెప్పిన తర్వాతే, ఈ వ్యవహారాన్ని టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాచుర్యంలోకి తెచ్చిందని విమర్శించారు. సాక్షి టీవీకి దీనితో సంబంధం లేదని కూడా స్పష్టంచేశారన్నారు. కానీ దీనిని ఆసరాగా చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం, మహిళల పేరుతో నిరసనల పేరిట ఉద్రిక్తతలు సృష్టించడం, సంకరజాతి వర్గాలు ఇందులో పాల్గొంటున్నాయన్న ఆరోపణలు చేస్తూ అసహనం వ్యక్తం చేశారు.
దీనిపై మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇవ్వడం, రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. మహిళలను వేశ్యలు అంటూ అవమానించడమే కాక, ఇప్పుడు వారిపై ‘సంకరజాతి’ వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా మహిళలు నిరసన వ్యక్తం చేస్తే.. అది అధికారపార్టీకి ఎందుకు ఇంత తాళలేకుండా పోతోందో అని ప్రశ్నించారు. మహిళలను కించపరిచే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మహిళల గౌరవం కోసం తాము చట్టపరంగా పోరాడతామని స్పష్టం చేశారు. మొత్తం మీద అమరావతి వివాదం, మీడియా ప్రకటనలు, రాజకీయ నాయకుల పరస్పర ఆరోపణలు ఇప్పుడు ఏపీ రాజకీయాలను హోరెత్తిస్తున్నాయి.
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
This website uses cookies.