RTC Bus Stand : గుడ్‌న్యూస్.. రూ.100 కోట్ల తో హైదరాబాద్ లో మరో కొత్త ఆర్టీసీ బస్టాండ్.. ఎక్కడో తెలుసా…?
ప్రధానాంశాలు:
హైదరాబాద్ లో కొత్త బస్టాండ్ కు శ్రీకారం..ఎక్కడో తెలుసా..?
RTC Bus Stand : గుడ్‌న్యూస్.. రూ.100 కోట్ల తో హైదరాబాద్ లో మరో కొత్త ఆర్టీసీ బస్టాండ్.. ఎక్కడో తెలుసా...?
RTC Bus Stand : హైదరాబాద్ Hyderabad CIty నగర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. నగరంలోని ఆరాంఘర్ ప్రాంతంలో అత్యాధునిక Bus Stand బస్‌స్టేషన్ నిర్మాణానికి తెలంగాణ ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. ప్రయాణికుల సౌకర్యం, ట్రాఫిక్ సమస్యల తగ్గింపుతో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దక్షిణ ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. దీనికోసం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరింది…

RTC Bus Stand : గుడ్‌న్యూస్.. రూ.100 కోట్ల తో హైదరాబాద్ లో మరో కొత్త ఆర్టీసీ బస్టాండ్.. ఎక్కడో తెలుసా…?
RTC Bus Stand : హైదరాబాద్‌లో మరో ఆధునిక బస్టాండ్‌కి శ్రీకారం – ఆరాంఘర్‌లో రూ.100 కోట్ల ప్రాజెక్టు
ఈ కొత్త బస్టాండ్‌ను ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలకు ఉపయోగపడే విధంగా రూపొందించనున్నట్లు సమాచారం. ఈ మూడు జిల్లాల ప్రజలు పెద్దఎత్తున హైదరాబాద్‌కి రాకపోకలు సాగిస్తుండటంతో, ఇప్పుడు ఉన్న బస్టాండ్‌లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని దక్షిణ తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన ప్రయాణ సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఆర్టీసీ ఈ ప్రాజెక్టు రూపొందించింది.
ఈ కొత్త బస్టాండ్ ద్వారా దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజలకు రవాణా మరింత వేగవంతం, సౌకర్యవంతం కానుంది. దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ బస్టాండ్‌కి అన్ని ఆధునిక సౌకర్యాలు, స్మార్ట్ ఫెసిలిటీలు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇది పూర్తి అయితే, ప్రయాణికుల ఒత్తిడి తగ్గటంతో పాటు, నగరానికి వచ్చే వాహనాల రద్దీపై కూడా నియంత్రణ కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.