MLC Kavitha : 2024లో కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లే అవకాశం .. జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు.. !!

Authored By aruna | The Telugu News | Published on: January 4, 2024, 7:00 pm

MLC Kavitha ; ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. తాజాగా అయిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఆమె ఏదో ఒక కేసులో జైలుకు వెళతారని అన్నారు. అలాగే తెలంగాణలో మరో 8 , 9 మంది లీడర్స్ కూడా ఏదో ఒక కేసులో జైలుకు వెళతారని అన్నారు. కాబట్టి వీళ్లంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. వాళ్ల పేర్లు చెబితే భయపడతారని చెప్పడం లేదని వేణు స్వామి అన్నారు. రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు దేనికైనా సిద్ధంగా ఉండాలి అని అన్నారు.

అలాగే దేశ రాజకీయాలలో కూడా కొందరు రాజకీయ నాయకులు జైలుకు వెళ్లి పరిస్థితి వస్తుందని అన్నారు. ఇక ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవి గండం ఉందని కూడా చెప్పారు. ఆయన అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అందుకు సంబంధించిన ఆలోచనలు చేసుకోవడం ఉత్తమం అని సూచనలు చేశారు. వ్యాపారవేత్తలు బ్యూరోక్రాట్లు కూడా జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అలాగే తెలంగాణలో ఓ ముఖ్య నేత కొడుకు యువనేత వ్యక్తిగత జీవితం సంచలనంగా మారే అవకాశాలు ఉన్నాయని వేణు స్వామి పేర్కొన్నారు. దేశంలో ఒక ముఖ్యమంత్రికి ఇద్దరు డిప్యూటీ సీఎంలకు ఆరోగ్య భంగములు కనిపిస్తున్నాయని ఆయన వివరించారు.

దీంతో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇటీవల వేణు స్వామి చెబుతున్న జాతకాలు బెడిసి కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. ప్రభాస్ కెరియర్ ముగుస్తుందని, తెలంగాణలో మళ్లీ కేసీఆర్ వస్తారని జోస్యం చెప్పారు. కానీ ప్రభాస్ సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక కేసీఆర్ ఓడిపోయారు. దీంతో వేణుస్వామి జాతకాలు చెప్పడం మానేయాలంటూ నెటిజన్స్ ట్రోల్ చేశారు. అయినా కూడా వాటన్నింటినీ కవర్ చేస్తూ వేణు స్వామి జాతకాలు చెబుతూనే ఉన్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp