Rythu Bima : రైతుల‌కి అల‌ర్ట్.. రైతుభీమా దరఖాస్తులకు నేడు చివ‌రి గడువు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rythu Bima : రైతుల‌కి అల‌ర్ట్.. రైతుభీమా దరఖాస్తులకు నేడు చివ‌రి గడువు

Rythu Bima : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ది, రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ 2024-25 ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. రేవంత్ సర్కార్ మొత్తం బడ్జెట్ రూ.2,91,159 కోట్లుగా వుంటే అందులో సింహభాగం వ్యవసాయ రంగానికే కేటాయించారు. ఏకంగా రూ.72,659 కోట్లను వ్యవసాయ, అనుబంధ రంగాలను కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తక్కువ ఉత్పాదకత కారణంగా తరచుగా సంభవించే కరువు కారణంగా రైతుల ఆదాయం తగ్గుతోంది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 August 2024,1:10 pm

ప్రధానాంశాలు:

  •  Rythu Bima : రైతుల‌కి అల‌ర్ట్.. రైతుభీమా దరఖాస్తులకు నేడు చివ‌రి గడువు

Rythu Bima : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ది, రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ 2024-25 ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. రేవంత్ సర్కార్ మొత్తం బడ్జెట్ రూ.2,91,159 కోట్లుగా వుంటే అందులో సింహభాగం వ్యవసాయ రంగానికే కేటాయించారు. ఏకంగా రూ.72,659 కోట్లను వ్యవసాయ, అనుబంధ రంగాలను కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తక్కువ ఉత్పాదకత కారణంగా తరచుగా సంభవించే కరువు కారణంగా రైతుల ఆదాయం తగ్గుతోంది. మెజారిటీ రైతులు వీటిపైనే ఆధారపడాల్సి వస్తుంది.దీన్ని దృష్టిలో ఉంచుకుని, రైతులకు ఆర్థిక , సామాజిక భద్రతను నిర్ధారించడానికి, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలోని ఇతర కార్యక్రమాలతో పాటు రైతు సమూహ జీవిత బీమా పథకం (రైతు బీమా) పేరుతో 2018 లో కేసీఆర్ ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని రూపొందించింది.

Rythu Bima ఆగస్టు 5 గడువు

రైతుబీమా పథకానికి అర్హులైన కొత్త రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఆగస్టు 5 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోని 18 నుంచి 59 ఏండ్ల వయసు గల రైతులు ఏఈవోకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించింది. ఈ నెల 28 వరకు పట్టాదారు పాస్‌బుక్‌ వచ్చిన రైతులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అర్హులైన రైతులు పట్టాదార్‌ పాస్‌బుక్‌ లేదా డిజిటల్‌ సంతకం చేసిన డీఎస్‌ పేపర్‌, ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డు దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే.. బీమా మొత్తం రూ. 5 లక్షలు చెల్లిస్తారు. నామినీకి 10 రోజుల్లో ఈ పథకం లబ్ధి అందుతుంది. తొలి ఏడాదిలో ప్రతి రైతు పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,271 చొప్పున చెల్లించగా గత ఏడాది రూ.3,556 చొప్పున చెల్లించింది.కొత్త పట్టాదారు రైతులు 2024 జులై 28వ తేదీ వరకు పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు కూడా రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. ఇప్పటివరకు రైతు బీమా చేసుకోలేకపోయిన రైతులు మాత్రమే రైతు బీమా చేసుకోవాలని పేర్కొంది.

Rythu Bima రైతుల‌కి అల‌ర్ట్ రైతుభీమా దరఖాస్తులకు నేడు చివ‌రి గడువు

Rythu Bima : రైతుల‌కి అల‌ర్ట్.. రైతుభీమా దరఖాస్తులకు నేడు చివ‌రి గడువు

ఎల్ఐసీకి మొత్తం ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది. తొలి ఏడాదిలో ప్రతి రైతు పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,271 చొప్పున చెల్లించగా గత ఏడాది రూ.3,556 చొప్పున చెల్లించింది. అర్హత కలిగిన రైతులు ఏఈవో కు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. దరఖాస్తు ఫారం తో పాటు పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం చేసిన డిఎస్ పేపర్ మరియు రైతు యొక్క ఆధార్ కార్డు మరియు నామీని యొక్క ఆధార్ కార్డులను జత చేయాల్సి ఉంటుంది.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది