Barrelakka : బర్రెలక్క పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా..?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 23 March 2024, 5:00 pm
  •  Barrelakka : బర్రెలక్క పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా..?

Barrelakka : బర్రెలక్క.. barrelakka alias sirisha  ఈ పేరును అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే ఇది పేరు కాదు.. సోషల్ మీడియాను సునామీలా ముంచేసిన ఓ బ్రాండ్. హాయ.. ఫ్రెండ్స్.. బర్లకాడికొచ్చిన ఫ్రెండ్స్ అంటూ ఆమె చేసిన ఒక్క వీడియో పెద్ద దుమారమే రేపింది. తెలంగాణ నిరుద్యోగులు బతుకు చిత్రం అంటూ ఆ వీడియోను అటు ప్రతిపక్షాలు, ఇటు నిరుద్యోగులు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో.. దెబ్బకు ఆమె ఫేమస్ అయిపోయింది. ఆమె ఎవరా అంటూ అందరూ ఆరా తీశారు. ఆ తర్వాత ఆమె తనకు ఫేమ్ తెచ్చిపెట్టిన బర్రెల వీడియో ఇమేజ్ తోనే.. బర్రెలక్క అనే ఐడీ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్లు తెరిచింది.

అందులో ఆమె చేసే వీడియోలకు భారీ ఫాలోయింగ్ పెరిగింది. బర్లు మేపుకుంటూ ఆమె చేసిన వీడియోలు బాగా ఫేమస్ అయ్యాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే.. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ మరో ఎత్తు. ఎందుకంటే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె ఏకంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసింది. తెలంగాణ ప్రజల మొత్తం అటెన్షన్ ఆమె వైపు మళ్లించుకుంది. ఇటు తెలంగాణలోనే కాదు అటు ఏపీలో కూడా ఆమె గెలుస్తుందా లేదా అని అంతా ఆసక్తిగా చూశారు. తాను నిరుద్యోగుల తరఫున పోరాడుతున్నానని.. వారి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానంటూ చెప్పిన మాటలు.. ఆమెకు భారీగా మద్దతు తీసుకొచ్చాయి.

ఏకంగా ఎన్నారైలు ఆమెకు డబ్బులు విరాళంగా ప్రకటించేసరికి.. ఆమెను మీడియా కూడా విపరీతంగా హైలెట్ చేసింది. దాంతో Telanganan తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో Telangana assembly elections కొల్లాపూర్ వైపు ప్రజల దృష్టి మళ్లింది. కానీ బ్యాడ్ లక్ బర్రెలక్క ఓడిపోయింది. కానీ ఒక చిన్న బిందువులా మొదలైన ఆమె ప్రయాణం.. రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేసే సింధువులా మారింది. ఇక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆమెకు ఫాలోయింగ్ తగ్గలేదు. అయితే ఆమె మీద చాలా ఫేక్ వీడియోలు వచ్చాయి. అందులో చెప్పుకోదగ్గది పల్లవి ప్రశాంత్ తో పెండ్లి అనే ఫేక్ వీడియో. ఆ వీడియో ద్వారా పల్లవి ప్రశాంత్ తో ఆమె పెండ్లి అయిపోయిందంటూ చాలా వార్తలు పుట్టుకొచ్చాయి.

barrelakka alias sirisha get married soon

barrelakka alias sirisha get married soon

కానీ అదేం నిజం కాదని ఆమె తెలిపింది. అయితే ఇప్పుడు మాత్రం ఆమె నిజంగానే పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే పెండ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. దాంతో వరుడు ఎవరా అనిఅంతా ఆరా తీస్తున్నారు. కానీ వరుడిని మాత్రం ఇప్పటి వరకు ఆమె పరిచయం చేయలేదు. ఆమె దూరపు బంధువు అని.. ఎన్నికల్లో చాలా మద్దతుగా నిలిచాడు అంటూ మాత్రం తెలిపింది బర్రెలక్క. మార్చి 28న పెళ్లి అని.. అదే రోజు అతన్ని పరిచయం చేస్తానంటూ తెలిపింది బర్రెలక్క.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి