RGV VS Barrelakka : రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క ఫిర్యాదు.. ఆ మాటలు అన్నాడని బర్రెలక్క సీరియస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

RGV VS Barrelakka : రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క ఫిర్యాదు.. ఆ మాటలు అన్నాడని బర్రెలక్క సీరియస్

RGV VS Barrelakka : ఏపీలో ప్రస్తుతం సినిమా రాజకీయాలు నడుస్తున్నాయి. ఓవైపు ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం కూడా లేదు. ఈనేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమాను విడుదల చేస్తున్నారు. నిజానికి అది ఏపీ రాజకీయాలకు సంబంధించిన మూవీ. టీడీపీని బ్యాడ్ గా చూపిస్తూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గొప్పగా చూపించేలా ఈ సినిమాను తీశాడు ఆర్జీవీ. కావాలనే జగన్ ఈ సినిమాను […]

 Authored By kranthi | The Telugu News | Updated on :29 December 2023,3:16 pm

ప్రధానాంశాలు:

  •  మహిళా కమిషన్ కు ఫిర్యాదు

  •  వ్యూహం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో బర్రెలక్కపై వర్మ కామెంట్స్

  •  వర్మ కామెంట్స్ పై బర్రెలక్క ఫిర్యాదు

RGV VS Barrelakka : ఏపీలో ప్రస్తుతం సినిమా రాజకీయాలు నడుస్తున్నాయి. ఓవైపు ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం కూడా లేదు. ఈనేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమాను విడుదల చేస్తున్నారు. నిజానికి అది ఏపీ రాజకీయాలకు సంబంధించిన మూవీ. టీడీపీని బ్యాడ్ గా చూపిస్తూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గొప్పగా చూపించేలా ఈ సినిమాను తీశాడు ఆర్జీవీ. కావాలనే జగన్ ఈ సినిమాను ఆర్జీవీతో తీయించాడని విమర్శలు కూడా వస్తున్నాయి. టీడీపీని బ్యాడ్ చేయడం కోసమే ఆర్జీవీతో కలిసి జగన్ ఆడుతున్న నాటకం అని టీడీపీ నేతలు చెబుతున్నారు. వ్యూహం సినిమాను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో రామ్ గోపాల్ వర్మ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇంతలో ఆర్జీవీకి మరో షాక్ తగిలింది.

తాజాగా రామ్ గోపాల్ వర్మపై మహిళా కమిషన్ కు బర్రెలక్క శిరీష్ ఫిర్యాదు చేసింది. దానికి కారణం.. వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బర్రెలక్క గురించి వర్మ మాట్లాడటం. వ్యూహం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఊరు పేరు లేని ఆవిడ బర్రెలక్కగా చాలా ఫేమస్ అయింది. బర్రెలను కాసే ఓ అమ్మాయే అంత పాపులర్ అయితే.. పవన్ కళ్యాణ్ ఎందుకు అంత ఫేమస్ కాలేకపోతున్నాడు అంటూ రామ్ గోపాల్ వర్మ బర్రెలక్క గురించి కామెంట్లు చేశారు.

అవి తనను అవమానపరిచేలా ఉన్నాయని.. నాపై వర్మ అలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అంటూ తన లాయర్ తో కలిసి మహిళా కమిషన్ కు వెళ్లి బర్రెలక్క ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు ఆర్జీవీ వర్సెస్ టీడీపీ కాస్త యూటర్న్ తీసుకొని బర్రెలక్క వర్సెస్ ఆర్జీవీగా మారింది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది