Telangana Assembly Elections 2023 : ఎన్నికలకు ఇంకా ఒక్క రోజు కూడా టైమ్ లేదు.. ఆ రెండు పార్టీల పొత్తు కన్ఫమ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana Assembly Elections 2023 : ఎన్నికలకు ఇంకా ఒక్క రోజు కూడా టైమ్ లేదు.. ఆ రెండు పార్టీల పొత్తు కన్ఫమ్

 Authored By kranthi | The Telugu News | Updated on :29 November 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  బీఆర్ఎస్, బీజేపీ సిద్ధాంతం ఒక్కటేనా?

  •  బీఆర్ఎస్ కి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఏంటి పరిస్థితి?

  •  బీజేపీ వ్యూహం ఫలిస్తుందా?

Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఒక్క రోజు కూడా సమయం లేదు. రేపు ఈ సమయం వరకు సగం శాతం పోలింగ్ కూడా పూర్తవుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిది గెలుపు అనేది పక్కన పెడితే ఎన్నికలకు ఇంకా ఒక్క రోజే ఉండటంతో ప్రచారం కూడా ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ డబ్బులు పంచే పనిలో ఉన్నాయి. ఓటర్లను ప్రలోభానికి పూనుకుంటున్నాయి. నిజానికి ఈసారి అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఒంటరిగానే బీఆర్ఎస్ పోటీ చేస్తున్నా ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ రావడం కూడా కష్టమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ బీభత్సంగా దూకుడు మీదుంది. మామలుగా కాదు.. రచ్చ రచ్చ చేసేలా ఉంది కాంగ్రెస్ పార్టీ. అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మామూలు ఊపు లేదు. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ ఎన్నికలు కాస్త హీట్ ను పెంచుతున్నాయనే చెప్పుకోవాలి.

అయితే.. అధికార బీఆర్ఎస్ పార్టీపై ఇంత నెగెటివిటీ రావడానికి కారణం ఒకే ఒక్క విషయం. అది బీజేపీతో సఖ్యతగా ఉండటం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీని మైకుల ముందు తిట్టి.. వెనుక మాత్రం ఆ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందుకే ఎమ్మెల్సీ కవితను కూడా బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ కాకుండా ఆపిందని.. అందుకే బీఆర్ఎస్, బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకుందని అంటున్నారు. ఒక సంవత్సరం కింది వరకు కూడా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం అంటే అందరూ బీజేపీ అనే అన్నారు. అప్పటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయి. రెండో స్థానంలో ఉన్న బీజేపీని నెట్టేసి కాంగ్రెస్ టాప్ లోకి వచ్చేసింది. బీజేపీ మళ్లీ మూడోస్థానానికి పడిపోయింది. అయితే.. ఇక్కడ బీజేపీ స్ట్రాటజీ వేరు.. బీఆర్ఎస్ స్ట్రాటజీ వేరు.

Telangana Assembly Elections 2023 : బీజేపీకి వచ్చే సీట్లు బీఆర్ఎస్ కే ప్లస్సా?

ఇక్కడ అసలు వ్యూహం ఏంటంటే.. బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ అందుకోక పోయినా.. ఎంఐఎం సీట్లు కొన్ని ఉంటాయి. ఆ తర్వాత బీజేపీ సీట్లు కొన్ని ఉంటాయి. ఎంఐఎం సీట్లు సరిపోకపోతే.. బీజేపీ సీట్లను కూడా సాయం తీసుకొని.. బీజేపీకి కూడా అధికారంలో షేర్ ఇచ్చేలా.. బీజేపీ సపోర్ట్ తో అధికారంలోకి రావాలనేది బీఆర్ఎస్ ప్లాన్. బీజేపీ ప్లాన్ ఏంటంటే.. బీఆర్ఎస్ సాయంతో అధికారంలోకి వచ్చి కొంత సమయం తర్వాత బీఆర్ఎస్ లో చీలికలు తీసుకొచ్చి మహారాష్ట్ర ప్లాన్ ను అమలు చేయాలనేది వాళ్ల వ్యూహం. ఎటు చేసి ఈ రెండు  పార్టీలు కలిసి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ.. కాంగ్రెస్ ను మాత్రం అధికారంలోకి రాకుండా చేయాలనేది అసలు ప్లాన్. మరి.. ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది