AIYF : భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి పోస్టర్స్ విడుదల : ఏఐవైఎఫ్
AIYF ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి : భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్ర లు డిమాండ్ చేశారు. AIYF రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికను హిమాయత్ నగర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె.ధర్మేంద్ర లు సంయుక్తంగా మాట్లాడుతూ భగత్ సింగ్ జీవితం భారత దేశ యువతకు స్ఫూర్తిదాయకమని, అటువంటి మహనీయుని త్యాగాలను నేటి సమాజానికి తెలపాల్సిన భాద్యత పాలకులదేనని వారు ఉద్ఘాటించారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
AIYF : భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి పోస్టర్స్ విడుదల : ఏఐవైఎఫ్
భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల ఐక్యతను చీల్చే మతోన్మాద రాజకీయాలు నేడు దేశంలో విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని, స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనైనా…. నేటి కాలంలోనైనా అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చి దోపిడీదారులకు ఉపకరించే, దేశ ద్రోహ కర్తవ్యాన్నే మతోన్మాద శక్తులు నెరవేరుస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశ స్వాతంత్య్ర సముపార్జన ధ్యేయంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన భగత్ సింగ్ స్వాతంత్ర్య అనంతరం కుల, మతాలకు అతీతంగా ధనిక, పేద తారతమ్యాలు లేని, అవినీతి రహిత సమసమాజ స్థాపన కలలు కన్నాడన్నారు. మతోన్మాద ముక్త భారతం సాదించడానికి భగత్ ఆలోచనలు, ఆయన చూపిన కార్యాచరణ, మనకు తరగని స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఇనుప కండరాలు,
ఉక్కునరాలు గల యువత దేశానికి అవసరం అని ప్రభోదించి సూక్తిగా నిలిచి “ఆత్మ విశ్వాసంకు మించిన ఆయుధం లేదని చాటి చెప్పిన భగత్ సింగ్ ప్రేరణతో, యువజనులతో మమేకమై ఉత్తేజ, ఉద్వేగభరితమైన ఉద్యమాలు సాగిస్తూ AIYF యవజనుల గుండెల్లో నిలిచిందన్నారు. సామాజిక, న్యాయం, లౌకిక వాదన పరిరక్షణ, శాస్త్రీయ సోషలిజం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా శాంతి స్థాపన కోసం, అశ్లీల సాహిత్యం, అశ్లీల సినిమాల నిషేధం కోసం, దేశాన్ని చీల్చడానికి కుట్రలు చేనే వచ్చిన్నకర శక్తులకు వ్యతిరేకంగా, దేశ ఐక్యత, సమైక్యత కోసం AIYF కృషిచేస్తున్నదన్నారు. ఇంతటి పోరాట చరిత్ర కలిగిన AIYF ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ 94వ వర్ధంతి ని పురష్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా క్రీడోత్సవాలు,డ్రగ్స్, మత్తు పదార్థాల వ్యతిరేక కాంపెయిన్,యువకవి గాయకుల సమ్మేళనం,రక్తదాన శిబిరాలు,సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాస రచన, చిత్రలేఖన పోటీలు, సదస్సులు, ర్యాలీలు, కాగడాల ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ లింగం రవి,కునుకుంట్ల శంకర్, వెంకటేశ్వర్లు, నానబాల రామకృష్ణ, యుగంధర్,పేరబోయిన మహేందర్, సత్య ప్రసాద్,బిజ్జ శ్రీనివాసులు,శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.