AIYF : భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి పోస్ట‌ర్స్ విడుద‌ల‌ : ఏఐవైఎఫ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AIYF : భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి పోస్ట‌ర్స్ విడుద‌ల‌ : ఏఐవైఎఫ్

 Authored By ramu | The Telugu News | Updated on :4 March 2025,10:40 pm

ప్రధానాంశాలు:

  •  AIYF ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడోత్సవాలు

AIYF  ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి : భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్ర లు డిమాండ్ చేశారు. AIYF రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికను హిమాయత్ నగర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె.ధర్మేంద్ర లు సంయుక్తంగా మాట్లాడుతూ భగత్ సింగ్ జీవితం భారత దేశ యువతకు స్ఫూర్తిదాయకమని, అటువంటి మహనీయుని త్యాగాలను నేటి సమాజానికి తెలపాల్సిన భాద్యత పాలకులదేనని వారు ఉద్ఘాటించారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.

AIYF భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి పోస్ట‌ర్స్ విడుద‌ల‌ ఏఐవైఎఫ్

AIYF : భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి పోస్ట‌ర్స్ విడుద‌ల‌ : ఏఐవైఎఫ్

AIYF  భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ 94వ వర్దంతి గోడ పత్రిక ఆవిష్కరణ

భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల ఐక్యతను చీల్చే మతోన్మాద రాజకీయాలు నేడు దేశంలో విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని, స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనైనా…. నేటి కాలంలోనైనా అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చి దోపిడీదారులకు ఉపకరించే, దేశ ద్రోహ కర్తవ్యాన్నే మతోన్మాద శక్తులు నెరవేరుస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశ స్వాతంత్య్ర సముపార్జన ధ్యేయంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన భగత్ సింగ్ స్వాతంత్ర్య అనంతరం కుల, మతాలకు అతీతంగా ధనిక, పేద తారతమ్యాలు లేని, అవినీతి రహిత సమసమాజ స్థాపన కలలు కన్నాడన్నారు. మతోన్మాద ముక్త భారతం సాదించడానికి భగత్ ఆలోచనలు, ఆయన చూపిన కార్యాచరణ, మనకు తరగని స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఇనుప కండరాలు,

ఉక్కునరాలు గల యువత దేశానికి అవసరం అని ప్రభోదించి సూక్తిగా నిలిచి “ఆత్మ విశ్వాసంకు మించిన ఆయుధం లేదని చాటి చెప్పిన భగత్ సింగ్ ప్రేరణతో, యువజనులతో మమేకమై ఉత్తేజ, ఉద్వేగభరితమైన ఉద్యమాలు సాగిస్తూ AIYF యవజనుల గుండెల్లో నిలిచిందన్నారు. సామాజిక, న్యాయం, లౌకిక వాదన పరిరక్షణ, శాస్త్రీయ సోషలిజం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా శాంతి స్థాపన కోసం, అశ్లీల సాహిత్యం, అశ్లీల సినిమాల నిషేధం కోసం, దేశాన్ని చీల్చడానికి కుట్రలు చేనే వచ్చిన్నకర శక్తులకు వ్యతిరేకంగా, దేశ ఐక్యత, సమైక్యత కోసం AIYF కృషిచేస్తున్నదన్నారు. ఇంతటి పోరాట చరిత్ర కలిగిన AIYF ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ 94వ వర్ధంతి ని పురష్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా క్రీడోత్సవాలు,డ్రగ్స్, మత్తు పదార్థాల వ్యతిరేక కాంపెయిన్,యువకవి గాయకుల సమ్మేళనం,రక్తదాన శిబిరాలు,సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాస రచన, చిత్రలేఖన పోటీలు, సదస్సులు, ర్యాలీలు, కాగడాల ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ లింగం రవి,కునుకుంట్ల శంకర్, వెంకటేశ్వర్లు, నానబాల రామకృష్ణ, యుగంధర్,పేరబోయిన మహేందర్, సత్య ప్రసాద్,బిజ్జ శ్రీనివాసులు,శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది