Ranya Rao : స్మగ్లింగ్ కేసులో హాట్ కన్నడ బ్యూటీ అరెస్ట్
Ranya Rao : బంగారం స్మగ్లింగ్ అనేది ఎప్పటినుంచో నడుస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్నో ఎయిర్‌పోర్టుల్లో అక్రమంగా బంగారం తరలించే వ్యక్తులు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన నటి రమ్య రావు అక్రమంగా బంగారం తీసుకొస్తూ డీఆర్ఐ అడ్డంగా దొరికింది. దుబాయ్ నుంచి తరచుగా భారత్‌కు బంగారం తీసుకువస్తున్న ఆమెపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు నిఘా పెట్టి, బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Ranya Rao : స్మగ్లింగ్ కేసులో హాట్ కన్నడ బ్యూటీ అరెస్ట్
డీఆర్ఐ అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. రమ్య రావు ఈసారి దుబాయ్ నుంచి 14.8 కిలోల బంగారం అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించింది. ఈ బంగారం విలువ సుమారు రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. గత 15 రోజుల్లోనే నాలుగుసార్లు ఆమె దుబాయ్ వెళ్లి రావడం అనుమానాస్పదంగా మారడంతో అధికారులు ప్రత్యేకంగా ఆమెపై నిఘా ఉంచారు. చివరకు పక్కా సమాచారం మేరకు బంగారం బిస్కెట్లను దుస్తుల్లో దాచి తీసుకువస్తుండగా పట్టుకున్నారు.
ఆమె గతంలో కూడా ఇలానే స్మగ్లింగ్‌లో పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రమ్యను అరెస్ట్ చేసిన డీఆర్ఐ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె తాను డీజీపీ కూతురిని అంటూ ప్రచారం చేసుకుంటోందని తెలుస్తోంది. కన్నడ చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి, ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్‌తో కలిసి “మాణిక్య” సినిమాలో నటించింది.
AIYF ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి : భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతిని రాష్ట్ర…
India vs Australia Semi-Final : మంగళవారం జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో భారత్…
Warangal Airport : వరంగల్‌లో మామనూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్…
Bigg Boss Season 09 : తెలుగు టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ మరోసారి హోస్ట్…
Samantha : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా…
Janasena : జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెండెం…
Book A Train : బంధువులు, స్నేహితులు, ఒకే ఆపార్ట్‌మెంట్ వాసులు, కాలనీ వాసులు అంతా కలిసి ఏదైనా విహార…
Jr NTR : మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా నో చెప్పే…
This website uses cookies.