BJP – BRS అంతర్గత పొత్తు నిజమేనా.. మరి దీనిలో లాభం ఎవరికి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

BJP – BRS అంతర్గత పొత్తు నిజమేనా.. మరి దీనిలో లాభం ఎవరికి..?

BJP – BRS : చాలామందికి తెలియని అంశం ఏంటంటే ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే బిజెపితో పొత్తు పెట్టుకోకుండా నడిచింది లేదు. టిఆర్ఎస్ పార్టీ కూడా బిజెపికి , అలాగే బిజెపి ప్రవేశపెట్టిన ఎన్నో బిల్లులకి పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది. ఇక ఇప్పుడు ఢిల్లీలో రైతుల ధర్నాలు చేస్తున్నట్లుగా గతంలో చేసినప్పుడు కూడా కేసీఆర్ బిజెపికి వ్యతిరేకంగా వ్యవహరించలేదు. ఇక 2022 లాంటి టైం లో బిఆర్ఎస్ స్థాపించి బిజెపికి […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 February 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  BJP - BRS అంతర్గత పొత్తు నిజమేనా.. మరి దీనిలో లాభం ఎవరికి..?

BJP – BRS : చాలామందికి తెలియని అంశం ఏంటంటే ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే బిజెపితో పొత్తు పెట్టుకోకుండా నడిచింది లేదు. టిఆర్ఎస్ పార్టీ కూడా బిజెపికి , అలాగే బిజెపి ప్రవేశపెట్టిన ఎన్నో బిల్లులకి పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది. ఇక ఇప్పుడు ఢిల్లీలో రైతుల ధర్నాలు చేస్తున్నట్లుగా గతంలో చేసినప్పుడు కూడా కేసీఆర్ బిజెపికి వ్యతిరేకంగా వ్యవహరించలేదు. ఇక 2022 లాంటి టైం లో బిఆర్ఎస్ స్థాపించి బిజెపికి ఎదురు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత కరోనా టైంలో కూడా నరేంద్ర మోడీకి మద్దతుగా నిలిచారు. అయితే ఇలా బిజెపితో పొత్తు పెట్టుకోవడం ప్రాంతీయ పార్టీలకు కొత్త కాదు అని చెప్పాలి. అయితే వీళ్లు మళ్లీ చేతులు కలిపే పరిస్థితి ఉందా..ప్రస్తుతం రాబోతున్న లోక్ సభ ఎన్నికలకు బిజెపి టిఆర్ఎస్ పొత్తు కలిసి వెళ్లే అవకాశాలు ఉన్నాయా…? ఒకవేళ రెండు పార్టీలు కలిసి వెళ్తే ఏం జరుగుతుంది…?దీనివలన ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అంశాల గురించి మాట్లాడుకుంటే…

తెలంగాణ ప్రాంతంలో బిజెపి పార్టీతో కలిసి టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళితే ప్రజలు ఎలా చూస్తారు..? కలిసి వెళ్లకపోతే ఎలా చూస్తారు అనే అంశం గురించి మాట్లాడుకుంటే…? తెలంగాణలో మొన్న గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ మరియు బిజెపి మధ్య అంతర్గత పొత్తు ఉంది అని , ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదు కానీ అంతర్గతంగా కలిసి వెళుతున్నారని ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ మరియు టిఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా పొత్తు ఏమీ లేదు అని నిరూపించుకో తగ్గ పనులు ఏమి చేయలేదు. ఇక మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షం పెట్టి అందరినీ పిలిస్తే అక్కడికి టిఆర్ఎస్ పార్టీ వెళ్లలేదు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే బిజెపి నేతలు కూడా అక్కడికి వెళ్లలేదు.

దీంతో ప్రస్తుతం ఈ రెండు పార్టీలు అంతర్గతంగా పొత్తు పెట్టుకుని ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్న వాదనలు నిజం అనేలా ప్రవర్తిస్తున్నారని పలువురు విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అఖిలపక్షం పిలిచినప్పుడు అందరూ కచ్చితంగా వెళ్లాలని ఏ పార్టీకి వారు యమునా తీరే అన్నట్లుగా ఉండకూడదు అంటూ పలువురు చెబుతున్నారు. అయితే వీరిద్దరూ నిజంగా పొత్తు పెట్టుకుంటారా అనే విషయాన్ని పక్కన పెడితే ఒకవేళ నిజంగా పొత్తు పెట్టుకుని ముందుకు వెళితే ఏం జరుగుతుందనే విషయాల గురించి ఇప్పుడు చర్చిద్దాం. అయితే ముందుగా ఈ పొత్తు వలన మోడీకి కలిగే లాభం ఏంటంటే NDA లో 400 పైచిలుకు ఎంపీ స్థానాలను కొట్టాలని ప్లాన్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి కెసిఆర్ వంటి నాయకుడితో ముందుకు వెళ్లడం అనేది కచ్చితంగా పాజిటివ్ ఇంపాక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే కనీసం మూడు ఎంపీ సీట్లు టిఆర్ఎస్ పార్టీకి వచ్చిన అవి NDA లో పడతాయి. అదేవిధంగా అధికారం కోల్పోయి ఉన్న కేసీఆర్ కు కూడా బిజెపితో కలిసి ముందుకెళ్లడం బాగా కలిసి వచ్చే అవకాశం అని చెప్పాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది