Etela Rajender : బిజెపి కి రాజీనామా చేయబోతున్న ఈటెల .?
ప్రధానాంశాలు:
సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ఈటెల..?
Etela Rajender : తెలంగాణ బీజేపీలో తాజా రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించిన ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆ అవకాశం రాకపోవడం వల్ల ఆయనలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అధిష్టానం తన సేవలను పట్టించుకోకపోవడంపై ఈటల మనస్తాపానికి గురయ్యారు. ఇప్పటికే బీసీ నేతలు, సన్నిహితులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికపై చర్చలు జరుపుతున్నారు.

బిజెపి కి రాజీనామా చేయబోతున్న ఈటెల .?
Etela Rajender తెలంగాణ మరో కొత్త పార్టీ
వినతులు, ప్రయత్నాలన్నీ విఫలమైన నేపథ్యంలో ఈటల రాజేందర్ పార్టీకి గుడ్‌బై చెప్పే దిశగా ఆలోచనలు ప్రారంభించినట్లు సమాచారం. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి రాజకీయ స్థిరత్వం, నాయకత్వం అవసరమనే అభిప్రాయంతో ఓ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే దిశగా ఆయన పరిశీలిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో బీసీ ఓటుబ్యాంక్‌పై ప్రభావం చూపే నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఈ పరిణామాలపై త్వరలోనే ఈటల ఓ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.
తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ప్రత్యేక గుర్తింపు పొందిన నేత. టీఆర్ఎస్‌ను వదిలి బీజేపీ లో చేరిన అనంతరం కీలక పాత్ర పోషించిన ఆయన, ఇప్పుడు అదే బీజేపీలోనూ పక్కకుపెడుతుందన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన కొత్త పార్టీ ప్రకటిస్తే, అది రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ పార్టీ నేతలపై అసంతృప్తితో పాటు, బీసీల రాజకీయ ప్రాధాన్యాన్ని పెంచాలనే దృక్పథంతో ఈటల తీసుకోబోయే నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.