Bontu Rammohan : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేంద్ర ప్లేస్ లో బొంతు రామ్మోహన్… కారణం ఏంటంటే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bontu Rammohan : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేంద్ర ప్లేస్ లో బొంతు రామ్మోహన్… కారణం ఏంటంటే…?

Bontu Rammohan : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పాలి. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మించి పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటాలని భావిస్తుంది. ఇక దీనికి సంబంధించి అభ్యర్థుల ఎంపికను ఆచితూచి పూర్తి చేస్తుంది. అయితే బీజేపీ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ 14 స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక కరీంనగర్, వరంగల్ ,హైదరాబాద్, స్థానాల లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ […]

 Authored By ramu | The Telugu News | Updated on :31 March 2024,9:00 pm

Bontu Rammohan : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పాలి. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మించి పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటాలని భావిస్తుంది. ఇక దీనికి సంబంధించి అభ్యర్థుల ఎంపికను ఆచితూచి పూర్తి చేస్తుంది. అయితే బీజేపీ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ 14 స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక కరీంనగర్, వరంగల్ ,హైదరాబాద్, స్థానాల లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని స్థానాలలో గెలుపు గుర్రాల కోసం బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. ఈ క్రమంలోనే దానం నాగేందర్, రంజిత్ రెడ్డి ,పట్నం సునీత ఇప్పటికే కాంగ్రెస్ లో చేరి టికెట్ ను దక్కించుకున్నారు. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న దానం నాగేందర్ ఎపిసోడ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. అయితే దానం కాంగ్రెస్ లో చేరే సమయంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం కండిషన్ పెట్టింది. కానీ దానం ఇప్పటివరకు రాజీనామా చేయలేదు.

తాను సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత రాజీనామా చేస్తా అని ప్రకటించడంపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ అని చెప్పిన నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలి అని సూచించింది. ఇదే సమయంలో దానం నాగేందర్ పై కోర్టు లో పిటిషన్ దాఖలయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సికింద్రాబాద్ అభ్యర్థిని మార్చాలని అధిష్టానం భావిస్తుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా జిహెచ్ఎంసి మేజర్ దామోదర్ పేరు తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్ సీటు గెలవడం కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకమైనది. దీంతో బొంతు రామ్మోహన్ తో పాటు మరో మాజీ మంత్రి పేరు కూడా పరిశీలన లో ఉన్నట్లు తెలుస్తుంది. దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడంపై మంత్రి కోమటి వెంకటరెడ్డి తనదైన రీతిలో స్పందించారు .ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీ పదవికి పోటీ చేస్తే సమస్యలు ఉత్పాదికమయ్యే అవకాశం ఉంది అని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే అయిన ఆయన రాజీనామా చేయకుండా ఎంపీ పదవికి పోటీ చేస్తే లీగల్ గా సమస్యలు వస్తాయి అని అంటున్నారు.

అంతేకాక దానం కాంగ్రెస్ లో చేరడం పై ఆ పార్టీ కార్యకర్తలునేతలు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకునే ముందు అన్ని కండిషన్ కి ఒప్పుకున్న దానం ఇప్పటికీ వాటిని బ్రేక్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే దానం నాగేంద్ర ను పోటీ నుంచి తప్పించి ఆ స్థానంలో మరో అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం .ఒకటి రెండు రోజుల్లో అధిష్టానం దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మిగిలిన స్థానాల అభ్యర్థుల పై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరియు వరంగల్ లో అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి ,కడియం కావ్య పేర్లు ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక నేడు లేదా రేపు దీనిపై అధికారం గా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది