Private School Fees : ప్రైవేట్ స్కూల్ ఫీజుల పెంపుకు బ్రేక్: కొత్త చట్టంతో నియంత్రణకు ప్రభుత్వం సన్నాహాలు
ప్రధానాంశాలు:
Private School Fees : ప్రైవేట్ స్కూల్ ఫీజుల పెంపుకు బ్రేక్: కొత్త చట్టంతో నియంత్రణకు ప్రభుత్వం సన్నాహాలు
Private School Fees : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల Private and corporate school fees పెంపుపై నియంత్రణ తీసుకురావాలని ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ విద్యార్థులు తల్లిదండ్రులపై భారం మోపుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలకు కళ్లెం వేసేందుకు కొత్త చట్టాన్నిnew lawతీసుకురావడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఈ చట్టం ద్వారా ఫీజుల పెంపును నియమబద్ధంగా పారదర్శకంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం ఇకపై ప్రైవేట్ స్కూళ్లు ప్రతి ఏడాది ఫీజులు పెంచే అవకాశం ఉండదు. రెండేళ్లకు ఒకసారి మాత్రమే అది కూడా గరిష్టంగా 8 శాతం లోపు పెంచుకునేలా చట్టబద్ధమైన పరిమితిని విధించనున్నారు. దీంతో తల్లిదండ్రులకు ఆర్థిక స్థిరత్వం కల్పించడమే కాకుండా స్కూళ్ల మధ్య అసమానతలు తగ్గించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది.
Private School Fees : ప్రైవేట్ స్కూల్ ఫీజుల పెంపుకు బ్రేక్: కొత్త చట్టంతో నియంత్రణకు ప్రభుత్వం సన్నాహాలు
Private School Fees : ఫీజు రెగ్యులేటరీ కమిటీ కీలక పాత్ర
ఫీజుల పెంపు విషయంలో ఇకపై ప్రైవేట్ స్కూళ్లు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఫీజులు పెంచాలంటే తప్పనిసరిగా రాష్ట్ర ఫీజు రెగ్యులేటరీ కమిటీ State Fee Regulatory Committee అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కమిటీ స్కూల్ ఫీజులను నిర్ణయించే ముందు పలు కీలక అంశాలను పరిశీలించనుంది. పాఠశాల ఆదాయం, ఖర్చులు, టీచర్లు సిబ్బంది జీతాలు మౌలిక వసతులపై వెచ్చిస్తున్న మొత్తం విద్యార్థుల సంఖ్య వంటి వివరాలతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఫీజుల పెంపుకు అనుమతి ఇవ్వనున్నారు. 8 శాతం పరిమితిలోనే ఫీజులు పెంచేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా రాబోయే కేబినెట్ సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించనున్నారు.
Private School Fees : ప్రైవేట్ స్కూళ్ల అభ్యంతరాలు, కమిషన్ సిఫార్సులు
ప్రభుత్వ ప్రతిపాదనపై ప్రైవేట్ స్కూళ్ల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న సుమారు 11 వేల ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న బడ్జెట్ స్కూళ్లు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. రెండు సంవత్సరాలకు ఒకసారి 8 శాతం ఫీజు పెంపు అనేది ఆమోదయోగ్యం కాదని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ Private Schools Association స్పష్టం చేసింది. పెరుగుతున్న ధరలు నిర్వహణ ఖర్చులు టీచర్లు మరియు సిబ్బంది జీతాల పెంపు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏడాది కనీసం 5 శాతం వరకు ఫీజులు పెంచుకునే అవకాశం ఇవ్వాలని స్కూళ్లు డిమాండ్ చేస్తున్నాయి. సంవత్సరానికి ఒకసారి స్వల్ప పెంపు ఉంటేనే ఆర్థికంగా నిర్వహణ సాధ్యమవుతుందని వారి వాదన. ఇదే సమయంలో తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కీలక సూచనలు చేసింది.
Private School Fees : జిల్లా వారీగా ఫీజు నియంత్రణ కమిటీ
ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలకు ఫీజులు నిర్ణయించే తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ తరహాలోనే ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూళ్ల కోసం ప్రత్యేక ఫీజు రెగ్యులేటరీ కమిషన్ Fee Regulatory Commission ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కమిషన్‌కు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తిని ఛైర్మన్‌గా నియమించాలని సభ్యులుగా సీనియర్ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, పాఠశాల యాజమాన్య ప్రతినిధులు ఉండాలని సిఫార్సు చేసింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో ఫీజు నియంత్రణ కమిటీల ఏర్పాటు కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్‌ను పరిగణనలోకి తీసుకుని ఫీజు పెంపు నిర్ణయించడం మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి అమలు వంటి అంశాలను కూడా కమిషన్ ప్రతిపాదించింది. ఈ అన్ని అంశాలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుండగా రానున్న రోజుల్లో ప్రైవేట్ స్కూల్ విద్యలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.